టీమిండియా కెప్టెన్ కోహ్లీ గురించి ఈ మధ్య ఎన్ని రూమర్స్ వచ్చాయో అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడే కాదు కోహ్లీ కెప్టెన్సీ గురించి ముందు నుంచే రచ్చ జరుగుతుంది.
కోహ్లీ ఫ్యాన్స్ మ్యాచ్ ఓడిపోతే చాలు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేయండి అనే కామెంట్స్ ఎన్నో చక్కర్లు కొట్టాయి.తాజాగా కోహ్లీ అధికారికంగా ప్రకటించకముందే కొన్ని పత్రికల్లో, యాప్స్ లో కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నాడు అనే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేసాయి.
కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని రూమర్స్ చేసారు.అయితే వీటితో పాటు కోహ్లీపై ఫిర్యాదులు కూడా చేశారనే కథనాలు కూడా వచ్చాయి.
న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమి తర్వాత కోహ్లీ పై వైస్ కెప్టెన్ అజింక్య రహానే, చటేశ్వర పుజారా, రవిచంద్రన్ అశ్విన్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, కోహ్లీని కెప్టెన్సీ నుంచి అందుకే కావాలని తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.అయితే వీటన్నింటికి ముఖ్యంగా పుకార్లకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ బుధవారం ముగింపు పలికారు.
మీడియా అనవసర కథనాలను రాస్తోందని, మీరు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారని అసహనం వ్యక్తం చేశారు.కోహ్లీ గురించి ఏ ఆటగాడు కూడా ఫిర్యాదు చేయలేదని, మీరు తప్పు కథనాలు రాసి విషయాన్నీ పెద్దదిగా చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
బీసీసీఐ ప్రతిదానికి సమాధానం ఇవ్వదని చెప్పారు.ప్రపంచకప్ లో మార్పులు కూడా జరుగుతాయి అనే కథనాలు కూడా వస్తునాన్నాయని అసలు మీకు ఆ వార్తలు ఎవరు చెప్పారో చెప్పాలని ప్రశ్నించారు.
ఈ కథనాలు తప్పు అని, వాస్తవం లేని కథనాల్ని చెప్పారు.నా దగ్గరికి వచ్చి ఏ ఆటగాడు ఫిర్యాదు చేయలేదని, ఆ కథనాలను ఖండించారు.

కొద్ది రోజుల క్రితం కోహ్లీ కెప్టెన్సీ పై బోర్డ్ సెక్రటరీ జయ్ షా ఆటగాళ్ల అభిప్రాయాలు కోరారని కోహ్లీ కెప్టెన్సీ పట్ల చాలా మంది సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారనే పుకార్లు వచ్చాయని చెప్పారు.కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని అందరు గౌరవించారని తెలిపారు.అంతే తప్ప బలవంతంగా ఇటువంటివి ఇక్కడ జరగవని, మీరు ఇస్తున్న కథనాలు, చేస్తున్న పుకార్లు భారత క్రికెట్ కి మంచిది కాదని చెప్పారు.