వామ్మో, ఒకేసారి 50 ఆమ్లెట్లు తిన్న వ్యక్తి.. వీడియో వైరల్...

ఇంటర్నెట్ వేదికగా ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు మనల్ని అబ్బురపరుస్తాయి.అలాంటి ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసింది.

 Competitive Eater Sapattu Raman Eats 50 Omlets At A Time Details, 50 Omletts, Ea-TeluguStop.com

ఈ వీడియోలో ఒక వ్యక్తి 50 కోడి గుడ్ల ఆమ్లెట్లను ఒకేసారి లాగించేశాడు.సాధారణంగా ఎంత ఆకలి వేసినా మహా అంటే పది కంటే ఎక్కువ ఆమ్లెట్లను తినలేం.

అలాంటిది ఈ వ్యక్తి ఒకేసారి 50 ఆమ్లెట్లను తినడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ప్లాస్టిక్ బల్లపై అరటి ఆకులపై పరిచిన ఆమ్లెట్లను చూడొచ్చు.ఇవి మొత్తంగా 50 ఎగ్ ఆమ్లెట్లు కాగా వాటిని తినేందుకు ఒక వ్యక్తి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.

సదరు వ్యక్తి చూసేందుకు సాధారణంగానే కనిపించినా మాయాబజార్ సినిమాలో ఎస్పీ రంగారావు వలె క్షణాల్లోనే ఆహారాన్ని గుటుక్కున మింగుతూ ఆశ్చర్యపరిచాడు.సెకండ్ల వ్యవధిలోనే ఓ ఆమ్లెట్ మింగేసిన ఇతడు ఆ తర్వాత 50 ఆమ్లెట్లను ఆరగించేశాడు.

దీనికి సంబంధించిన వీడియోని @porchezhiyan_sr ఇన్ స్టాగ్రామ్ ఐడీ షేర్ చేసింది.ఇప్పటికే దీనికి మిలియన్లు వ్యూస్, లక్షల లైకులు వచ్చాయి.ఈ వీడియో చూశాక “ఈ స్థాయిలో తినకండి.బీపీ పెరుగుతుంది” అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొందరు “మీరే మొత్తం తినకండి.అందుకు బదులు పేదవారికి పంచండి” అని చెబుతున్నారు.

మిగతా వారు మాత్రం తన టాలెంట్ చూసి వామ్మో అని ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోపై మీరూ ఓ లుక్కు వెయ్యండి.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సాపత్తు రమాన్. ఇతడు కాంపిటేటివ్ ఈటర్ గా తనని తాను పరిచయం చేసుకోవడమే కాదు అందుకు తగినట్టుగా కుంభాలు కుంభాలు లాగిస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తున్నాడు.యూట్యూబ్ లో ఇతను తినే వీడియోలు చూడడానికి నెటిజన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే ఆయనకు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.ఇతను చికెన్ పీసులు కూడా ఎవరు తినలేనన్ని తినగలుగుతాడు.బిర్యానీ, వడలు, దోశ ఇలా ఏదైనా సరే అతను అధికంగా తింటూ తన ప్రత్యేకమైన టాలెంట్ తో అబ్బురపరుస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube