నువ్వా నేనా ? పోటీలుపడుతున్న జగన్ కేసీఆర్  

Competition Between Cm Kcr And Cm Jagan -

ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు అనేలా ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి.ఏపీలో యంగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ప్రస్తుతం తాను చరిత్ర సృష్టించే సీఎంగా రాబోయే తరాలకు ఆదర్శమైన నాయకుడిగా కనిపించేందుకు తాపత్రయపడుతున్నాడు.

Competition Between Cm Kcr And Cm Jagan

ప్రస్తుతం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నాడు.అంతే కాదు తన మంత్రిమండలిలో కూడా ఎవరూ ఊహించనివారికి పదవులు ఇవ్వడమే కాకుండా సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించడంతో జగన్ మీద ప్రశంసలే తప్ప విమర్శలు ఎక్కడా రాలేదు.

ఇక్కడ ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కూడా చెప్పుకోవాలి.

నువ్వా నేనా పోటీలుపడుతున్న జగన్ కేసీఆర్-Political-Telugu Tollywood Photo Image

కేసీఆర్ కూడా తెలంగాణ లో తన సత్తా ఏంటో చాటుకున్నాడు.

ప్రజల ఆలోచనను పసిగట్టడం, సెంటిమెంట్ ను రగల్చడంలో కేసీఆర్ సిద్దహస్తుడు.ఇప్పుడు ఈ సీఎం లు ఇద్దరూ ఒకరికి ఒకరు పోటీ పడే పరిస్థితి వచ్చింది.

వాస్తవంగా చూస్తే ఈ ఇద్దరూ ఎందులోనూ సమకాలికులు కాదు కానీ ప్రజల మనసు దోచుకోవడం కోసం సమంగా ఇద్దరూ పోటీపడుతున్నారు.సంక్షోభాలను ముందే ఊహించి సుదీర్ఘ ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.

ప్రతిపక్షాల ఊహకు కూడా అందకుండా వ్యూహాలు రచిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు.ప్రజలు ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం కదా కొంత సమయం వేచి చూద్దాం అనే ఆలోచనతో ఉంటే వీరు మాత్రం రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

రాబోయే రోజుల్లో రాజకీయంగా తమకు ఎదురే లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు.

కేసీఆర్ విషయానికి వస్తే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీ బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.అయితే ఐదేళ్లలో తన వ్యూహాలతో రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచి మహాకూటమిని మట్టికరిపించాడు కేసీఆర్.వ్యవసాయం, సామాజిక అవసరాలు, మంచినీటి సదుపాయం, సాగునీటి పారుదల, సౌకర్యవంతమైన ఇళ్లు, ఆసరా లేని వారికి ఆర్థిక అండదండలు, సామాజిక వర్గాల వారిగా ప్రయోజనాలు కల్పించి ప్రతి వర్గానికి చేరువయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు.

దీని ద్వారా ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లగలిగాడు.కేసీఆర్ తో పోల్చుకుంటే జగన్ రాజకీయ అనుభవం తక్కువ.అయితేనేమి కేసీఆర్ ను మించి ప్రజాధారణ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇప్పుడు కాదు ఇక ముందు కూడా మేమే అన్నట్టుగా వీరి రాజకీయం నడుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Competition Between Cm Kcr And Cm Jagan- Related....