ఐపీఎల్ తో పోలిస్తే మాత్రం ప్రపంచ ప్రైజ్ మనీ తక్కువే...

టి20 ప్రపంచకప్ ఆరంభం అయ్యేందుకు 20 రోజుల కంటే కూడా తక్కువ సమయమే ఉంది.ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రపంచకప్ జట్లను ఎంపిక చేశాయి.కొన్ని జట్లు సన్నాహక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్నాయి.టి20 ప్రపంచకప్ జట్టును అక్టోబర్ 9వ తేదీలోపు మార్చుకునే వీలు కూడా ఉంది.ఈ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో నగదు పారితోషికంగా లభించనుంది.టి20 ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిచే జట్టు 1.6 మిలియన్ల అమెరికన్ డాలర్లను గెలుచుకునే అవకాశం ఉంది.మన కరెన్సీలో ఈ మొత్తం దాదాపుగా రూ.13.05 కోట్లు.ఐపీఎల్ తో ప్రైజ్ మనీతో పోలిస్తే ఇది తక్కువే.ఈ ఏడాది ఐపీఎల్ లో గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు ప్రైజ్ మనీగా వచ్చింది.ఇక రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీగా దక్కే అవకాశం ఉంది.

 Compared To Ipl, The World Prize Money Is Less , Ipl, Cricket , Sports News , Sp-TeluguStop.com

ఇక సెమీఫైనల్లో ఓడిపోయిన రెండు జట్లకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది.ఒక్కో జట్టు 4 లక్షల అమెరికన్ డాలర్ల చొప్పున ప్రైజ్ మనీగా దక్కుతుంది.ఇండియన్ కరెన్సీలో దాదాపుగా విజేతకు – రూ.13.05 కోట్లు, రన్నరప్ జట్టుకు – రూ.6.52 కోట్లు,సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు – రూ.3.26 కోట్ల చొప్పున రెండు జట్లకు అందుతాయి.సూపర్ 12లో ఓడిన 8 జట్లకు, ఒక్కో జట్టుకు రూ.57 లక్షల చొప్పున 8 జట్లకు అందుతాయి.

గ్రూప్ దశలో నిష్క్రమించే 4 జట్లు, ఒక్కో జట్టుకు రూ.32 లక్షల చొప్పున నాలుగు జట్లకు అందుతాయి.వీటితో పాటు గ్రూప్, సూపర్ 12 దశలో జరిగే మ్యాచ్ ల్లో విజయం సాధించే ప్రతి జట్టుకు కూడా ప్రైజ్ మనీ దక్కనుంది.

గ్రూప్ దశలో 12 మ్యాచ్ లు, సూపర్ 12లో 30 మ్యాచ్ లు జరగనున్నాయి.ఈ లెక్కన మొత్తం 42 మ్యాచ్ లు జరుగుతాయి.ప్రతి మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు రూ.32.62 లక్షలు ప్రైజ్ మనీగా వస్తుంది.టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ విలువ 45.67 కోట్ల రూపాయలు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube