పొగతాడం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం నెత్తినోరు మొత్తుకుంటున్నా వినేవారు లేరు.సినిమా థియేటర్లలో, బస్టాపుల్లో పొగతాడం నిషేధం అనే బోర్డులు మనకు దర్శనమిస్తాయి.
పొగతాడం వల్ల క్యాన్సర్ బారిన పడి చస్తారని డాక్టర్లు చెప్పినా వినే నాధుడు లేడు.అయితే తాజాగా ఓ కంపెనీ మాత్రం పొగతాగితే ఏకంగా రూ.2 లక్షలకు పైగా జీతం ఇస్తామంటూ ప్రకటించింది.
కంపెనీ ఎక్కడో చెప్పండి.
మేము కూడా వెళతాం అని రెడీ అవుతున్నారా? ఆగండీ.ఆ కంపెనీ మనదగ్గర లేదులెండీ.AmericanMarijuana.org అనే సంస్థ స్మోకింగ్ చేసి ఆ ఉత్పత్తికి సంబంధించిన రివ్యూ రాయాల్సిందిగా ఓ ప్రకటనలో తెలిపింది.ఈ కంపెనీలో తయారయ్యే వివిధ ప్రోడక్టులను స్మోక్ చేసి వాటిపై రివ్యూ రాసి నెలకు 3వేల డాలర్లు సంపాదించవచ్చంటూ ప్రకటన చేసింది.
అయితే దీనికి వారు ఓ షరతు కూడా పెట్టారు.స్మోకింగ్ చేసి రివ్యూలు రాసేవారు పూర్తి ఆరోగ్యంగా ఉండాల్సిందిగా తెలిపింది.
దానికి సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్ను వారు సమర్పించాల్సి ఉంటుందని సదరు కంపెనీ పేర్కొంది.కొన్నిసార్లు గంజాయిని కూడా వారు రివ్యూ రాయాల్సి ఉంటుందని, దాన్ని తాగి తమపై తాము నియంత్రణ కోల్పోకుండా రివ్యూ రాయగల సత్తా ఉన్నవారికే ఉద్యోగం ఉందంటూ ఆ కంపెనీ చెప్పుకొచ్చింది.
మరి ఇలాంటి ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేస్తారో చూడాలి అంటున్నారు నెటిజన్లు.