మనలో కొంతమంది ఇన్వెస్టర్లు ఎక్కువగా డివిడెండ్ ఆదాయాన్ని( Dividend income ) ఇచ్చే షేర్లలోనే దీర్ఘకాలం పెట్టుబడులను పెట్టి వాటిని ఏళ్ల తరబడి కొనసాగిస్తుంటారు.ఎందుకంటే ఇలాంటి క్వాలిటి షేర్లలో ఇన్వెస్ట్( Invest in quality shares ) చేయటం వలన ఆదాయంతో పాటు క్యాపిటల్ అప్రీసియేషన్ అనేది లభిస్తుంది.
ఈ క్రమంలో వందల్లోనో లేక వేలల్లోనో డివిడెండ్ రూపంలో రిటర్స్న్ అనేది పొందుతుంటారు.మహా అయితే లక్షల్లో ఆదాయం వస్తుంది.కానీ కొంత మంది విషయంలో ఈ డివిడెండ్ ఆదాయం ఏకంగా వేల కోట్ల రూపాయలుగా ఉందనే విషయం మీరు ఎపుడైనా విన్నారా?
ఆశ్చర్యం వేస్తుంది కదూ.కానీ ఇది వాస్తవం.ఏస్ ఈక్విటీ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అనిల్ అగర్వాల్ ( Anil Agarwal )నేతృత్వంలోని వేదాంత, హిందుస్థాన్ జింక్‌ల ప్రమోటర్ గ్రూపులు అత్యధిక డివిడెండ్ ఆదాయాన్ని పొందాయని సమాచారం.
ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వరంగ కంపెనీలైనటువంటి ఓ యన్ జి సి, కోల్ ఇండియా నిలిచాయి.ఈ 2 కంపెనీలు భారత ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.కాగా గడచిన సంవత్సర కాలంలో దేశంలోని 5 కంపెనీల ప్రమోటర్లకు మాత్రం డివిడెండ్ ఆదాయం వేల కోట్ల రూపంలో వెళ్లిందని తెలుస్తోంది.
దేశంలోని 2వ అత్యంత బడా కంపెనీ అయినటువంటి టీసీఎస్( TCS ).గడచిన సంవత్సర కాలంలో ఒక్కో షేరుకు రూ.113 డివిడెండ్ చెల్లించింది.ఇక ఈ కంపెనీలో 72.3 శాతం ఈక్విటీ వాటాలను టాటా సన్స్ కలిగి ఉంది.దీంతో వారికి సుమారుగా డివిడెండ్ రూపంలో రూ.29,900 కోట్లను కొల్లగొట్టారని తెలుస్తోంది.దీని తర్వాత మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ కంపెనీ అయినటువంటి వేదాంత గడచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.101.5 డివిడెండ్ చెల్లించింది.దీంతో కంపెనీలో 69.69 శాతం ఈక్విటీ వాలాలను కలిగి ఉన్న బిలియనీర్ ప్రమోటర్ డివిడెండ్ రూపంలో రూ.26,000 కోట్లను అందుకున్నారు.అదేవిధంగా హిందుస్తాన్ జింక్, కోల్ ఇండియా సైతం మంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించింది.