వర్క్ వీసాలపై ప్రముఖ కంపెనీల ఆందోళన..ట్రంప్ కి లేఖాస్త్రం...!!!

అమెరికాలో కరోనా దెబ్బకి ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యిపోయింది.ఒకటి కాదు రెండు కాదు కోట్లాది అమెరికన్స్ ప్రస్తుతం ఉద్యోగాలు లేక రోడ్డున పడే పరిస్థతి ఏర్పడింది.

 America, Work Visas, Donald Trump,companies, Working Visas-TeluguStop.com

నిరుద్యోగులు అందరికి నిరుద్యోగ బృతి ఇవాలంటే అమెరికా గల్లా పెట్టె రోజుల వ్యవధిలో ఖాళీ అయ్యిపోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలో ట్రంప్ ఎలాంటి చర్యలు చేపడుతారు అనుకుంటున్న సమయంలో అమెరికాలో ఉంటున్న విదేశీయులకి షాక్ ఇస్తూ వీసాలపై రద్దు చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.

హెచ్ -1బీ , మరియు ఇతర వర్కింగ్ వీసాలను పూర్తిగా రద్దు చేస్తామని ప్రభుత్వం నుంచీ ప్రకటన వెలువడటంతో ఒక్క సారిగా విదేశీయులు ఉలిక్కి పడ్డారు.అదే గనుకా జరిగితే లక్షలాది మంది విదేశీయుల భవిష్యత్తు అంధకారం అవుతుందని గగ్గోలు పెట్టారు.

ప్రముఖ కంపెనీలు సైతం ఈ విషయంలో షాక్ అయ్యాయి.అమెరికా పౌరులు ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని, ప్రస్తుతం వారికి ఉద్యోగాన్ని కలిపించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించాయి.

అయితే ఇది కేవలం ఆలోచన మాత్రమేనని ఇంకా ట్రంప్ ఈ విషయంపై ఓ నిర్ణయానికి రాలేదని అధికార వర్గాలు చెప్పినా ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనే ఆందోళనతో అమెరికాలో ఉన్న దాదాపు 50 ప్రముఖ కంపెనీలు అన్నీ ఏకమయ్యాయి హెచ్-1బీ వీసా మరియు ఇతర వర్కింగ్ వీసాలను సంరక్షించాలని ఒక వేళ వీటిని రద్దు చేసే ఆలోచన కూడా చేయవద్దంటూ లేఖలు రాసాయి.అత్యంత ప్రతిభావంతులలైన విదేశీ ఉద్యోగుల ప్రాధాన్యతని తగ్గిస్తే అది అమెరికా ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీస్తుందని లేఖలో తెలిపాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube