ఆ ఎమ్యెల్యేని వారం రోజుల్లోగా అరెస్ట్ చేయకపోతే ... ?   Communist Leaders Demands Arrest Chintamaneni Prabhakar     2018-11-06   22:29:48  IST  Sai M

కొద్ధి నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో టీడీపీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేస్‌లో చింతమనేనిపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ, సీపీఎం నాయకుడు వైవీ, న్యూడెమోక్రసి నేతలు నెల్లిమర్ల ప్రసాద్‌, డేగా ప్రసాద్‌లు డీజీపీని కలిసి.. చింతమనేనిని అరెస్ట్‌ చేయాల్సిందిగా కోరారు.

అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అండ చూసుకునే చింతమనేని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుతున్నారంటూ ఆరోపించారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్‌ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్‌ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామంటూ ఆయన హెచ్చరించారు.