'అఖండ - ఆచార్య' రెండింటిలోనూ కామన్ పాయింట్స్ గమనించారా ?

ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న చిత్రం ఆచార్య.కొరటాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను కూడగట్టుకుని విజయ మార్గం వైపు పయనిస్తోంది.

 Common Points In Chiranjeevi Acharya And Balakrishna Akhanda Movies Details, Ach-TeluguStop.com

మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.అయితే అఖండ సినిమాకి అలాగే ఆచార్య చిత్రానికి కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.

అవి అందరూ గమనించారో లేదో కానీ ఎవరో కొందరు అయిన ఆ పాయింట్స్ ను నోట్ చేసే ఉంటారు.అయితే ఇంతకీ ఆ కామన్ పాయింట్స్ ఏవి అన్నది ఇపుడు చూద్దాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా సినీ పరిశ్రమకు ముద్దు బిడ్డలే.ఈ సీనియర్ హీరోలు వయసు ఆరు పదులు దాటుతున్నా ఇప్పటికే అదే స్పీడ్ తో వరుస చిత్రాలు చేస్తున్నారు.

మొన్నటికి మొన్న బాలయ్య అఖండ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తే, ఇపుడేమో చిరు తన తనయుడితో ఆచార్య చిత్రంతో రంగం లోకి దిగారు.బాలకృష్ణ అఖండకు ముందు చివరిసారిగా 2019 లో రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కానీ ఆ సినిమా నిరాశను మిగిల్చింది.చిరంజీవేయి సైతం ఆచార్యకు ముందు 2019 లోనే సైరా నరసింహారెడ్డి తో వచ్చాడు.

కానీ ఈ సినిమా చిరు కు విజయాన్ని ఇవ్వలేకపోయింది.

Telugu Acharya, Acharyaakhanda, Akhanda, Balakrishna, Boyapati Srinu, Koratala S

ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు కూడా ఒకే సమయానికి షూటింగ్ ను స్టార్ట్ చేశాయి.అదే విధంగా అఖండ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సమయం లోనే ఆచార్య మూవీ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది.కాకపోతే బాలయ్య కరోనా వేవ్ కాస్త అటు ఇటుగా ఉన్న సమయం లోని దైర్యం చేసి బరిలోకి దిగగా… మెగాస్టార్ మాత్రం కరోనా భయం పూర్తిగా పోయే వరకు వెయిట్ చేసి మరీ తాజాగా రంగం లోకి దిగారు.

అఖండ సినిమాని బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసి సింహ, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నారు బాలయ్య.ఇక ఆచార్య చిత్రాన్ని సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ టేకాఫ్ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో పూజ హెగ్డే రామ్ కి జోడీగా నటించింది.

Telugu Acharya, Acharyaakhanda, Akhanda, Balakrishna, Boyapati Srinu, Koratala S

ఇక అఖండ, ఆచార్య ఈ రెండు చిత్రాల్లోనూ కామన్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ రెండు సినిమాల్లోనూ రెండు ప్రధాన పాత్రలు ఉన్నాయి.అయితే అఖండ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలను డ్యుయల్ రోల్ చేయగా, ఆచార్య సినిమాలో మెగాస్టార్ తన తనయుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇక ఈ రెండు చిత్రాల్లోనూ ధర్మాన్ని రక్షించడమే హీరోల ప్రధాన ధ్యేయం.

ఇక మైనింగ్, మాఫియాలు కూడా ఈ రెండు సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ గా ఉన్నాయి.మైనింగ్ లను ఆ పిండం మాఫియాల పని పట్టి ఊర్ల నుండి తరిమి కొట్టడం ఈ రెండు సినిమాల్లోనూ చూశాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube