అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాలలో ఈ కామన్ పాయింట్ గమనించారా?

కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లు ఏవనే ప్రశ్నకు అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాల పేర్లు సమాధానంగా వినిపిస్తాయి.బింబిసార సినిమా ఇప్పటికే 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.

 Common Point In Pataas Bimbisara Atakonnade Movies Details, Pataas, Bimbisara, Athanokkade Nandamuri Kalyan Ram , Bimbisara Movie, Kalyan Ram Movies, Tollywood, Devil Movie, Interesting Facts-TeluguStop.com

ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.అయితే అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ కొంతమందిని చంపుతూ విలన్లలో భయం కలిగేలా చేస్తుంటాడు.ఫ్లాష్ బ్యాక్ లో కళ్యాణ్ రామ్ ఆ విధంగా చేయడానికి గల కారణం వెలుగులోకి వస్తుంది.

 Common Point In Pataas Bimbisara Atakonnade Movies Details, Pataas, Bimbisara, Athanokkade Nandamuri Kalyan Ram , Bimbisara Movie, Kalyan Ram Movies, Tollywood, Devil Movie, Interesting Facts-అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాలలో ఈ కామన్ పాయింట్ గమనించారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతకొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ కొన్ని సన్నివేశాల్లో వయెలెంట్ గా కనిపించారు.పటాస్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో పరిచయమయ్యారు.

అయితే ఆ తర్వాత మార్పు వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా మెప్పించారు.

Telugu Atanokkade, Bimbisara, Devil, Kalyan Ram, Nandamurikalyan, Pataas, Tollywood-Movie

బింబిసార సినిమా విషయానికి వస్తే నిజ జీవితంలో ఎంతో మంచి వ్యక్తి అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో క్రూరమైన రాజు పాత్రలో కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.అయితే అహంభావంతో ప్రవర్తించే హీరో లైఫ్ లో చోటు చేసుకున్న కొన్ని ఘటనల వల్ల మారడం గమనార్హం.బింబిసార సక్సెస్ తో కళ్యాణ్ రామ్ కెరీర్ కూడా పుంజుకుంది.

ఈ మూడు సినిమాలలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారని ఈ తరహా పాత్రలు కళ్యాణ్ రామ్ కు కలిసొస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

Telugu Atanokkade, Bimbisara, Devil, Kalyan Ram, Nandamurikalyan, Pataas, Tollywood-Movie

డెవిల్ సినిమాకు నవీన్ మేడారం డైరెక్టర్ కాగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ కోరుకున్న విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.మరోవైపు కళ్యాణ్ రామ్ త్వరలో బింబిసార2 సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube