యోనితో ఇలాంటి తప్పులు చేయొద్దు అమ్మాయిలు

జననాంగాలు చాలా సన్నితమైనవి.స్త్రీ అయినా, పురుషుడైనా, తమ ప్రైవేట్ పార్ట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఎందుకంటే అవి చాలా సున్నితం, మీరు చేసే ఏ చిన్ని తప్పుని కూడా తట్డుకోలేనంత సున్నితమైనవి.ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 Common Mistakes Women Do With Their Vagina-Common Mistakes Women Do With Their Vagina-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఇంఫెక్షన్ల బెడద ఎక్కువ.కాబట్టి యోనితో ఇలాంటి తప్పులు మాత్రం చేయవద్దు.

* టైట్ ప్యాంటిలను తొడకగకపోవడమే మంచిది.అవి స్టయిలీష్ గా, సెక్సిగా కనిపించవచ్చు గాని, సొగసు కన్నా ఆరోగ్యం ముఖ్యం.

టైట్ ప్యాంటిలు వాడటం వలన ఎప్పటికప్పుడు మురికి, బ్యాక్టీరియా ఒకేచోట చాలాసేపు ఉండిపోతుంది.ఇక్కడే దురద, ఇంఫెక్షన్లు మొదలయ్యేది.

* పబ్లిక్ హేయిర్ మానవ శరీరానికి ఎందుకు ఉన్నట్లు? బ్యాక్టీరియా నుంచి, ఇంఫెక్షన్ల నుంచి సాధ్యమైనంతవరకు జననాంగాన్ని రక్షించడానికే కదా.ట్రెండిగా ఉండటం కోసం పబ్లిక్ హేయిర్ ని తీసేయొద్దు.భాగస్వామికి పబ్లిక్ హేయిర్ నచ్చకపోతే కట్ చేయడం కన్నా వాటి అవసరం గురించి వారికి అర్థమయ్యేలా మాట్లాడటం మేలు.

* పీరియడ్స్ లో ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మారూస్తూ ఉండాలి.

బ్లీడింగ్ అయినా కాకపోయినా ప్రతీ 12 గంటలకు ఓసారి ప్యాడ్ మార్చాల్సిందే అని డాక్టర్లు చెబుతారు.అలసత్వంతో మార్చకుండా అలానే ఉంచేస్తే ఇంఫెక్షన్లని అడ్డుకోవటం కష్టం.

* హార్మోన్స్ కంట్రోల్ లో ఉంటాయనుకోని స్టీమింగ్ ట్రై చేయడం, వెట్ నెస్ లో కెమికల్స్ కలిగిన లూబ్రికేంట్స్ వాడటం మూర్ఖత్వమే తప్ప, ఇంకేమి కాదు.

* అలాగే వెజైనాని క్లీన్ చేసుకోవడానికి కెమికల్స్ అస్సలు వాడొద్దు.

గోరువెచ్చని నీటితో జననాంగాన్ని శుభ్రపరుచుకోవాలని చెబుతారు డాక్టర్స్.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు