తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?  

common mistakes with headache -

సాధారణంగా తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.అయితే ఈ తలనొప్పి రావటానికి ఒత్తిడి, హేంగోవర్, నిద్ర సరిలేకుండుట, మైగ్రేన్ వంటివి కారణాలుగా ఉండవచ్చు.

తలనొప్పి వచ్చినప్పుడు బయట పడటానికి అద్భుతమైన సమర్ధవంతమైన ఇంటి ఔషదాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

TeluguStop.com - తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు…తలనొప్పిని పెంచుతాయా-Telugu Health-Telugu Tollywood Photo Image

సాధారణంగా తలనొప్పి రాగానే కాఫీ త్రాగుతూ ఉంటాం.ఇది నరాల వ్యవస్థను ఉద్రేకపరుస్తుంది.దీని ప్రభావం దాదాపుగా 5 గంటల వరకు ఉంటుంది.రెండు కప్పుల కాఫీ త్రాగితే తలనొప్పి తాత్కాలికంగా తగ్గిన మరల వచ్చే అవకాశం ఉంది.

అంతేకాక కాఫీని అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్ కు గురవుతుంది.కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ త్రాగటం చెడు అలవాటే అని చెప్పాలి.

ఎంత పనిలో ఉన్నా తలనొప్పి అనిపించగానే ఒక కప్పు టీ త్రాగేస్తూ ఉంటాం.పని ఒత్తిడికి మంచి రిలీఫ్ గా భావిస్తాం.అయితే టీలలో ఒక కప్పు గ్రీన్ టీ త్రాగితే మంచి రిలీఫ్ వస్తుంది.అయితే ఎక్కువగా త్రాగితే డీహైడ్రేట్ అవటం, అజీర్ణం, యూరిక్ యాసిడ్ ఏర్పడటం వంటివి జరుగుతాయి.

తలనొప్పి తగ్గటానికి చాలా మంది చాకోలెట్స్ తింటూ ఉంటారు.ప్రత్యేకంగా మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు.

డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది కాని అధికంగా ఈ చాక్లెట్ లు తింటే తలనొప్పి పెరుగుతుంది.డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Common Mistakes With Headache Related Telugu News,Photos/Pics,Images..