ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత కొన్నాళ్లకే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెల్సిందే.తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా కొత్త జిల్లాల నుండే పరిపాలన కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే ఏపీలో కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు.కాని ఇంతకు ముందు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా నాయకులు కొత్త జిల్లాల హామీ ఇవ్వడం జరిగింది.జగన్ గెలిస్తే ఖచ్చితంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు అందుకు సంబంధించిన అడుగులు వేస్తున్నాడు.
ఇటీవలే కొత్త జిల్లాలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఈ కమిటీలో ఉన్నత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఇంకా పలు ప్రజా సంఘాల వారు ఉంటారని తెలుస్తోంది. కమిటీ కన్వినర్‌గా ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహంచనున్నారు.
ఆయన ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేయబోతుంది.ఈ కమిటీ మూడు నెలల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన అధ్యయనం పూర్తి చేయాల్సి ఉంటుంది.
మూడు నెలల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎన్ని జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలి పరిపాలన సౌలభ్యం కోసం ఎలా విడదీయాలనే విషయాన్ని అధ్యయనం చేయనున్నారు.మూడు నెలల తర్వాత ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కొత్త జిల్లాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.
ఏపీలో మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాధన.మరి ఆ ప్రతిపాధనకు కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది కూడా చూడాలి.