టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి అందరికీ పరిచయమే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మంచి ఫాలోయింగ్ కూడా అందుకున్నాడు.
ఇక తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి చిన్న చిన్న పాత్రలో నటించి ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యాడు.సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటాడు.
తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్ డేట్ లను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.ఇదిలా ఉంటే నిఖిల్ ను కమిషనర్ సజ్జనార్ ఘనంగా సన్మానించాడు.
అదేంటి నిఖిల్ ను కమిషనర్ సన్మానించడం ఏంటి అనుకుంటున్నారా.నిజానికి నిఖిల్ ఒక నటుడిగానే కాకుండా సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తిగా కూడా నిలిచాడు.కరోనా మొదటి దశ నుండి ఇప్పటివరకు తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు.ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకు తనకు తోచినంత డబ్బు సహాయం చేశాడు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్లకి మెడికల్ కిట్ ను కూడా అందించాడు.అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్ లను కూడా అందించాడు.
కానీ నిఖిల్ చేసిన సహాయాలు మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు.
దీంతో తాజాగా నిఖిల్ సేవలను గుర్తించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్నిఖిల్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు గురించి అందరికీ తెలిపాడు.ఇక ఈయనను ప్రత్యేకంగా సన్మానించాడు.అంతేకాకుండా మరికొంతమంది ఉన్నత అధికారులు కూడా నిఖిల్ చేసిన సేవలను గుర్తించి సన్మానం చేశారు.
మొత్తానికి నిఖిల్ మంచి క్రెడిట్ అడ్డుకోవడంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా మరింత గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఈయన చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నాడు.సుకుమార్ రైటింగ్స్ లో 19 పేజెస్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇందులో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా పూర్తికాగా.కొన్ని డబ్బింగ్ పనులు మాత్రమే ఉన్నాయని సమాచారం.
ఇక ఈ సినిమాలతో నిఖిల్ ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.