"యాంకర్ సుమ" చేసిన పనికి కామెంట్స్ లో ఎలా తిడ్తున్నారో చూడండి.! లేక నిజంగానే జరిగిందా.?       2018-06-09   23:19:18  IST  Raghu V

సుమ కనకాల..తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి.యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది..స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.. అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు.ఒకవైపు టివి ప్రోగ్రాములు,మరోవైపు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సుమ గారికి ఇటీవలే ఓ ప్రమాదం తప్పింది.

ఈ టీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మొన్న ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న కార్యక్రమంలో సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. సుమ చేస్తున్న షో లావు క్యాష్ ఒకటి. ఈ కార్యక్రమం మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. సెలబ్రెటీలతో సందడి చేసే ఈ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ.

నిర్వాహకులు వెంటనే రియాక్ట్ అయ్యి సుమ దగ్గరకు వచ్చి లేపటానికి ప్రయత్నం చేసారు. అక్కడకు వచ్చిన సుమ అభిమానులు షాక్ అయ్యారు. వారికి తన మీద ఉన్న ప్రేమను చూసి సుమకు ఈ ఐడియా వచ్చిందేమో కానీ ఈ ఏక్సిడెంట్ సీన్ ని ప్రోమోలో పెట్టి తన మార్కెటింగ్ స్ట్రాటజీని చాటుకుంది సుమ.ఈ ప్రోమో చూసిన వారు సుమకు ఏమైంది…ఎలా జరిగిందంటూ ఆ కార్యక్రమాన్ని చూస్తారని,అద్భుతమైన TRP లు వస్తాయని సుమ ప్లాన్ వేసిందని అంటున్నారు. చూడాలి మరి ఈ క్యాష్ కార్యక్రమం ఎంత TRP ని సాధిస్తుందో ?