మీటూ : సూపర్‌ స్టార్‌ స్పందనపై అసంతృప్తి  

Comments About Rajinikanth Me Too Response-

దేశ వ్యాప్తంగా అట్టుడికి పోతున్న మీటూ ఉద్యమంపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్పందన సంతృప్తిగాలేదంటూ మహిళ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈయన ‘పేట’ చిత్రాన్ని పూర్తి చేసుకుని లక్నో నుండి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్బంగా చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజినీకాంత్‌ పలు విషయాలపై స్పందించాడు..

మీటూ : సూపర్‌ స్టార్‌ స్పందనపై అసంతృప్తి-Comments About Rajinikanth Me Too Response

మొదట శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశంపై స్పందిస్తూ కోర్టు తీర్పును అంతా కూడా ఒప్పుకోవాల్సిందే. కాని హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా మాత్రం ప్రవర్తించడం ఏ ఒక్కరికి మంచిది కాదని అన్నాడు. అదే సమయంలో మీటూ ఉద్యమం గురించి కూడా రజినీకాంత్‌ మాట్లాడటం జరిగింది.

మీటూ ఉద్యమం వల్ల మహిళలకు మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నాను. అయితే ఆడవారు దీన్ని సద్వినియోగం చేసుకుని తమకు జరిగిన అన్యాయంను చెప్పుకోవాలని, మరోసారి లైంగిక వేదింపులు ఎదుర్కోకుండా వారికి ఇదో మంచి ప్లాట్‌ ఫాం అంటూ రజినీకాంత్‌ అన్నారు. కొందరు మహిళలు ఈ ఉద్యమంను పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అలా చేయడం వల్ల మొత్తం మహిళ లోకం నష్టపోతుంది.

అందుకే మీటూ ఉద్యమంలో సక్రమంగా, నిజాయితీగా ఆడవారు పాల్గొని తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను తెలియజేయాలంటూ కోరాడు. వైరముత్తును కూడా రజినీకాంత్‌ వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు..

మీటూ ఉద్యమం గురించి రజినీకాంత్‌ చేసిన వాఖ్యలను మహిళా లోకం తప్పుబడుతోంది. ఏ మహిళ కూడా తనపై లైంగిక దాడి జరగక ముందే తనను వేదించాడంటూ ముందుకు వచ్చి చెప్పదని, ఆడవారికి సలహా ఇస్తున్న రజినీకాంత్‌ గారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలంటూ మహిళ సంఘాల నేతలు అంటున్నారు.

ఒక వైపు వైరముత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ఎందుకు ఆయన్ను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలు రజినీకాంత్‌ ను ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్న రజినీకాంత్‌ ఇలాంటి వివాదాస్పద విషయాల్లో కాస్త జాగ్రత్తగా స్పందించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.