'ఒడిశా మోడీ' జీవితం వివాదాస్పదమే...మత ఘర్షణల్లో పాలుపంచుకున్నారు

ఇటీవల కేంద్రం లో నరేంద్ర మోడీ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచిన సంగతి తెలిసిందే.ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని అందుకోవడం తో గతనెల 30 వ తేదీన మోడీ తో పాటు మోడీ క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసారు.

 Comments About Minister Pratap Sarangi Life-TeluguStop.com

అయితే ఈ ప్రమాణ స్వీకారం లో ఒక వ్యక్తి ప్రత్యేకంగా నిలిచారు.ఇప్పుడు సోషల్ మీడియా లో ఆయన గురించే చర్చ నడుస్తుంది అంటే నమ్మరు.

ఆయనే ప్రతాప్ చంద్ర సారంగి, అందరూ ఆయనను ‘ఒడిశా మోడీ’ అని కూడా పిలుస్తారు.తెల్లని బట్టలు,పెరిగిన గడ్డం తో సాధారణంగా కనిపించే ఈయను ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యారు.

అతి సాధారణ వస్త్రధారణ, వెదురు కర్రలతో నిర్మించిన ఓ గుడిసె నుంచి దిల్లీకి పయనమైన సారంగిని చూసి దేశం మొత్తం అబ్బురపడింది.

-Telugu Political News

కానీ ఆయన కనిపించే అంత ఇది కాదని పలు వివాదాలకు సంబంధించి ఆయనపై దాదాపు 18 కేసులు ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో ఆయనకు సంబందించిన వివరాలు వెల్లడి అవుతున్నాయి.1955… నీలగిర్ ప్రాంతంలోని గోపీనాథపురం, ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు… ఉత్కళ యూనివర్శిటీ పరిధిలోని బాలాసోర్‌లోనే డిగ్రీ వరకూ చదివాడు… మంచి వక్త… ఆధ్యాత్మిక జీవితంపై అనురక్తి… డిగ్రీ కాగానే రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారి, ప్రజాసేవకు అంకితం కావాలనేది ధ్యాస… పలుసార్లు బేలూరు మఠం వెళ్లాడు… తన బయోడేటా పరిశీలిస్తూ తనకు విధవరాలైన తల్లి ఉందనీ, ఊళ్లో ఒక్కతే ఉంటుందని తెలిసి అక్కడి గురువులు తనను మందలించారు… తల్లి సేవ చేసుకోపో అని నచ్చజెప్పి పంపించేశారు.ఊరూరూ తిరుగుతూ జనాలకు కావల్సిన పనులు చేసిపెడుతూ తిరిగేవాడు… గణశిక్షామందిర్ యోజన కింద గిరిజన గ్రామాల్లో సమరకరకేంద్రాల పేరిట బడులు ప్రారంభించటానికి ఎక్కువగా కృషి చేసేవాడు… చదువు ఉంటే చైతన్యం, ఆరోగ్యం, సంపద అన్నీ సమకూరతాయని నమ్మే వ్యక్తి.

అలాంటి వ్యక్తి ని బీజేపీ తన పార్టీలోకి స్థానం ఇచ్చింది.అయితే ఆయన చూసేంత మంచి వారు కాదని ఆయన పలు మత ఘర్షణల్లో పాలుపంచుకున్నట్లు తెలుస్తుంది.1999లో ఆస్ట్రేలియన్ క్రైస్తవ మిషనరీకి చెందిన గ్రాహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు పిల్లలను కొందరు హిందూ మూక సజీవ దహనం చేశారు.

-Telugu Political News

ఆ సమయంలో భజరంగ్ దళ్ ఒడిశా విభాగం అధ్యక్షుడిగా ఉన్న ప్రతాప్ సారంగి కి కూడా ఈ దాడిలో భాగం ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.అయితే విచారణ తరువాత అలాంటిది ఏమీ లేదని నివేదికలో వెల్లడైంది.ఆ తరువాత ఇదే కేసును విచారించిన స్థానిక న్యాయస్థానం 2003లో భజరంగ్ దళ్‌కు చెందిన దారాసింగ్‌తో పాటు 12 మందిని దోషులుగా నిర్ధరిస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే హైకోర్టు మాత్రం దారా సింగ్‌కు విధించిన మరణశిక్షను జైలు శిక్షగా తగ్గిస్తూ తీర్పు వెల్లడించగా, జీవిత ఖైదు పడిన మరో 11 మంది కి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.అలానే 2002లో ఒడిశా అసెంబ్లీపై భజరంగ్ దళ్, ఇతర హిందూ అతివాద గ్రూపుల దాడికి పాల్పడిన ఘటనలో అల్లర్లు , ఆస్తుల దహనం, దౌర్జన్యం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి నేరాలపై ఆయన అరెస్టయ్యారు.

అయితే ఇటీవల ఆయన సాధారణ జీవన శైలి కారణంగా పాపులారిటీ సంపాదించిన సారంగి ఇప్పుడు ఆయన జీవితంలోని తప్పులను ఎత్తిచూపుతూ వస్తున్న వార్తల తో మరోసారి సెలబ్రిటీ గా నిలిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube