జై జవాన్‌ : వీర జవాన్‌ చెల్లికి అన్నలైన 100 మంది సైనికులు

ఆర్మీలో చేరిన రోజే ప్రాణాలపై జవాన్‌లు ఆశ వదులుకోవాల్సి వస్తుంది.ప్రమాదం ఎప్పుడు ఎటునుండి వచ్చినా ఎదిరించి నిలిచేందుకు జవాన్‌లు సిద్దంగా ఉండాలి.

 Commando Jyoti Prakash Nirala Fellow Soldiers Joins His Sister Wedding-TeluguStop.com

అలా ఉన్నప్పుడే మన దేశంను సురక్షితంగా జవాన్‌లు కాపాడగలరు.ఎంతో మంది వీర జవాన్‌లు ఇండియాను కాపాడేందుకు తమ ప్రాణాలను పనంగా పెట్టారు.

సైనికుల్లో ఎవరైనా చావు భయంతో వెనకడుగు వేస్తే శత్రువు 10 అడుగులు ముందుకు వేసి భారత్‌పై దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది.అయితే అమరులు అయిన జవాన్‌ల కుటుంబాల పరిస్థితి ఏంటీ అనేది ఎక్కువ శాతం మంది ఆలోచించరు.

కాని భారత ఎయిర్‌ ఫోర్స్‌ జవాన్‌ జ్యోతి ప్రకాష్‌ నిరాలా చనిపోతే ఆయన బాధ్యతను 100 మంది సైనికులు నిర్వర్తించారు.

బీహార్‌కు చెందిన జ్యోతి ప్రకాష్‌ నిరాలా 2017వ సంవత్సరంలో ఉగ్రవాదులతో పోరాడుతూ మృతి చెందాడు.

గత ఏడాది ప్రకాష్‌ నిరాలాకు కేంద్ర ప్రభుత్వం అశోకచక్ర అవార్డును కూడా ఇచ్చింది.ఎన్ని అవార్డులు రివార్డులు ఇచ్చినా కూడా అతడు లేని లోటును ఎవరు తీర్చలేరు.

జ్యోతి ప్రకాష్‌ చెల్లి పెళ్లికి అన్న లేని లేటు కనిపించింది.ఆ సమయంలోనే ప్రకాష్‌ నిరాలాతో పని చేసిన జవాన్‌లు తామున్నామంటూ ముందుకు వచ్చారు.

ఏకంగా వంద మంది జవాన్‌లు ఆమెకు అన్నలయ్యారు.ఒక్క అన్నయ్య బదులుగా వంద మంది అన్నయ్యలు ఆమెకు దక్కారు.

జై జవాన్‌ : వీర జవాన్‌ చెల్లిక

వారి పెళ్లి ఆచారం ప్రకారం పెళ్లి కూతురు అన్నయ్య చేతుల మీదుగా కాలుళ్లు పెట్టి దాటి పోవాలి.ఆ సమయంలో వంద మంది జవాన్‌లు ఆమెను తమ చేతుల మీద కాళు పెట్టించి దాటించారు.ఆ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినా కూడా నాకు ఇంత మంది కొడుకులు ఉన్నారని సంతోషిస్తున్నాను అంటూ జ్యోతి ప్రకాష్‌ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.

పెళ్లి కూతురుకు అన్నగా నిలవడమే కాకుండా అందరు కలిసి వ్యక్తిగతంతో ఎంతో కొంత వేసుకుని మొత్తం 5 లక్షల రూపాయలను చెల్లికి పెళ్లి కానుకగా ఇవ్వడం జరిగింది.ఈ జవాన్‌ల మంచి మనసుకు ఎంత జై కొట్టినా తక్కువే.

అందుకే జై జవాన్‌.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube