రాజకీయల్లోకి రాబోతున్నారా.. నెటిజన్ ప్రశ్నకు నటి ప్రణిత సమాధానం ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Coming Into Politics Actress Pranitha Answer To Netizen Question Details,  Actre-TeluguStop.com

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూనే ఉంది.

ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

Telugu Nithin Raj, Pranitha, Pranithasubhash, Telugu, Tollywood-Movie

ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇదంతా పక్కన పెడితే.

ఇటీవల ఈ ముద్దుగుమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకుంది.

అంతేకాకుండా తన పాప ఫోటోలు కూడా షేర్ చేసుకుంది.పైగా ఎప్పటిలాగే మళ్ళీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటూ అక్కడ తన పాపతోని ఇక్కడ తన ఫాలోవర్స్ తోని ముచ్చట్లు పెడుతుంది.

Telugu Nithin Raj, Pranitha, Pranithasubhash, Telugu, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.ఇక అందులో చాలామంది తన కూతురు గురించి, తన ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు వేయగా వాటికి ఓపికగా సమాధానం చెప్పింది.ఇక ఒక నెటిజన్ మాత్రం తనను మీరు ఇంత సహాయం చేస్తున్నారు కదా రాజకీయాల్లోకి రాబోతున్నారా అని ప్రశ్నించడంతో వెంటనే ప్రణీత దానికి ఇలా స్పందించింది.

తను తన కూతురు పైన.తన ఫౌండేషన్ పైన మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంతేకానీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పేసింది.ఇక ప్రస్తుతం ఆసమాధానం నెట్టింట్లో వైరల్ గా మారగా.

నిజానికి రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్ అంటూ నెటిజన్ లు తనకు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు.ఇక తను మళ్లీ సినిమాల్లోకి రి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఫ్యామిలీతో బాగా బిజీగా ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube