సుందర్ సి , ఆర్య , రాశీ ఖన్నా , ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘ అరణ్మణై 3’.హార్రర్ కామెడీగా రూపొందింది .
ఇందులో సాక్షి అగర్వాల్ , వివేక్ , యోగిబాబు , మనోబాల ప్రధాన తారాగణం .సుందర్ సి దర్శకత్వం వహించారు .ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ అంతఃపురం ‘ పేరుతో తీసుకొస్తోంది గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ .రెడ్ జైంట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో , అవని సినీమాక్స్ ప్రై .లి .ఖుష్బూ సమర్పణలో , బెంజ్ మీడియా ప్రై .లి .ఎ .సి .ఎస్ .అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది .డిసెంబర్ 31 న ‘ అంతఃపురం ‘ ప్రేక్షకుల ముందుకు వస్తోంది .తెలుగులో ‘ చంద్రకళ ‘ గా విడుదలైన ‘అరణ్మణై’, ‘కళావతి’ గా విడుదలైన ‘ అరణ్మణై 2‘ సినిమాలు మంచి విజయాలు సాధించాయి .
తమిళంలో ‘ అరణ్మణై 3‘ కి మంచి స్పందన లభించింది .దాంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఏర్పడింది .దాంతో ఈ మూవీ పై అంచనాలు ఉన్నాయి .తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన రాశీ ఖన్నా ఇందులో నటించడం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి .ఆమె రోల్ , యాక్టింగ్ తమిళనాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి .పైగా , రాశీ ఖన్నా నటించిన ఫస్ట్ హార్రర్ కామెడీ సినిమా ఇది .క్యూట్ , బబ్లీ , పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేసిన ఆమె … హార్రర్ కామెడీలో ఎలా చేసి ఉంటారో అని తెలుగు ఆడియన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు . సుందర్ సి మాట్లాడుతూ “మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు .తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి .హార్రర్ , కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి .విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీ సినిమా .‘అంతఃపురం’ లో గ్రాండియర్ అందరినీ ఆకట్టుకుంటుంది .ఈ నెల 31 న సినిమా విడుదల చేస్తున్నాం . ప్రీ రిలీజ్ ఫంక్షన్ , ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్ : ఫెన్నీ ఒలీవర్ , యాక్షన్ : పీటర్ హెయిన్ , సినిమాటోగ్రఫీ : యు .కె .సెంథిల్ కుమార్ , మాటలు : ఎ .శ్రీనివాస మూర్తి , పాటలు : భువన చంద్ర , రాజశ్రీ సుధాకర్ , నేపథ్య గానం : ఎస్పీ అభిషేక్ , మ్యూజిక్ : సత్య సి , సమర్పణ : ఉదయనిధి స్టాలిన్ , ఎ .సి .ఎస్ .అరుణ్ కుమార్ , ఖుష్భూ , రచన , దర్శకత్వం : సుందర్ .సి.