కమెడియన్ చెంప పగులగొట్టిన అషురెడ్డి.. కారణమేంటంటే..?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు కామెడీ స్టార్స్ అనే షో గట్టి పోటీని ఇస్తున్న సంగతి తెలిసిందే.కామెడీ స్టార్స్ షోలో తనదైన కామెడీ టైమింగ్ తో అషురెడ్డి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

 Comedy Stars Promo Ashu Reddy Tattoo In Express Hari Heart, Comedy Stars Promo ,-TeluguStop.com

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అషురెడ్డి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు.అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో అషురెడ్డి ఎక్స్ ప్రెస్ హరి చెంప పగులగొట్టారు.


ఎక్స్ ప్రెస్ హరి చేసిన పని కోపం తెప్పించడంతో అషురెడ్డి ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఎక్స్ ప్రెస్ హరి ఊరమాస్ పాటతో ఎంట్రీ ఇచ్చి ఇలా ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటదిరా అని చెబుతాడు.

అప్పుడప్పుడూ కామెడీ కూడా చేస్తే చాలా బాగుంటుందని జడ్జీలు చెబుతున్నారని పక్కన ఉన్న వ్యక్తి చెబుతాడు.కాలేజ్ లో పరువంతా పోతుందని ఎక్స్ ప్రెస్ హరి చెప్పగా అంత పరువు పోగొట్టుకోవడానికి బదులుగా కాలేజ్ నుంచి వెళ్లిపోతే సరిపోతుంది కదా అని పక్కన ఉన్న వ్యక్తి వెల్లడిస్తాడు.

ఆ తరువాత ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి జాయిన్ అయిందిరా ఆ అమ్మాయిని చూడగానే నా హార్ట్ బీట్ అలాగే పెరిగిపోయిందని హరి వెల్లడిస్తాడు.ఎక్స్ ప్రెస్ హరి ప్రపంచంలో అందరూ చెల్లెళ్లే నువ్వు తప్ప అని చెప్పగా అందరూ రాఖీ కట్టేశారా అని అషురెడ్డి అడుగుతుంది.ఆ తర్వాత హరి అషురెడ్డికి ఐలవ్యూ చెప్పగా ఆమె షాకవుతుంది.ఆ తరువాత ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి పేరును పచ్చబొట్టును పొడిపించుకున్నానని చూపిస్తాడు.

స్కిట్ కోసం పచ్చబొట్టు వేయించుకున్నావా అని అషురెడ్డి అడగగా నిజంగానే వేయించుకున్నానని ఎక్స్ ప్రెస్ హరి చెప్పడంతో అషురెడ్డి అతని చెంపపై గట్టిగా కొడుతుంది.అయితే టీఆర్పీ కోసమే ఇలా చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube