లవ్ స్టోరీ చెప్పేసిన వైవా హర్ష.. పెళ్లి ఎప్పుడంటే..?  

comedian viva harsha gave clarity about marriage, Viva Short Film, Viva Harsha, Akshara, Viva Harsha Akshara Dating, Color Photo Film, Web Series - Telugu Akshara, Color Photo Movie, Comedian Viva Harsha, Marriage Date, Viva Harsha Sister

వైవా షార్ట్ ఫిలిం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్షకు ఈ నెల 9వ తేదీన అక్షర అనే యువతితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వైవా హర్ష నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

TeluguStop.com - Comedian Viva Harsha Gave Clarity About Marriage

తాజాగా వైవా హర్ష తను పెళ్లి చేసుకోబోయే యువతి గురించి, పెళ్లి గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

అక్షర తనకు నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉందని గత రెండు సంవత్సరాలుగా అక్షర, తాను డేటింగ్ లో ఉన్నామని వైవా హర్ష తెలిపారు.

TeluguStop.com - లవ్ స్టోరీ చెప్పేసిన వైవా హర్ష.. పెళ్లి ఎప్పుడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అక్షర ఎంకామ్ చదివిందని మొదట్లో తాను, అక్షర స్నేహితులు కాగా ఆ తరువాత తమ మధ్య ప్రేమ చిగురించిందని వైవా హర్ష చెప్పుకొచ్చారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తనకు అక్షరతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

తన తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పిన వెంటనే అంగీకరించారని హర్ష పేర్కొన్నారు.

అయితే అక్షర తండ్రి పెళ్లికి అంగీకరించడానికి కొంత సమయం తీసుకున్నారని వైవా హర్ష అన్నారు.ఆ తరువాత అక్షర తండ్రి తనను పూర్తిగా అర్థం చేసుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు.నిశ్చితార్థం జరిగిన సమయంలో అక్షర తండ్రి భావోద్వేగానికి గురయ్యాడని చెప్పుకొచ్చారు.

తన సోదరి లాస్ ఏంజిల్స్ లో ఉన్నారని ఆమె వచ్చిన తరువాత జూన్ లో లేదా జులై నెలలో వివాహం చేసుకుంటానని అన్నారు.

వైవా హర్ష అక్షరల వివాహం ప్రేమ వివాహమో, పెద్దలు కుదిర్చిన వివాహమో అని అభిమానులకు సందేహం ఉండగా హర్ష అన్ని విషయాల గురించి మీడియాతో మాట్లాడుతూ స్పష్టతనిచ్చారు.

గతేడాది కలర్ ఫోటో సినిమాలో నటించి ఆ సినిమాలోని పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్న వైవా హర్ష ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

#Akshara #ComedianViva #Marriage Date

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు