ఆ డ్రెస్ వల్లే బరువు తగ్గానని చెబుతున్న విద్యుల్లేఖ?

తెలుగు, తమిళం భాషల్లో లేడీ కమెడియన్ పాత్రల్లో నటించి విద్యుల్లేఖ రామన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.గతంలో బొద్దుగా కనిపించిన విద్యుల్లేఖ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని బరువు తగ్గారు.కొన్ని రోజుల క్రితమే ఈమె రోకా వేడుక కూడా జరిగింది.86.5 కేజీల నుంచి 66.5 కేజీలకు తగ్గిన విద్యుల్లేఖ కృషి, పట్టుదల, అంకిత భావాన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు.

 Comedian Vidyullekha Reveals Weight Loss Secret, Vidyullekha Raman, Weight Loss-TeluguStop.com

తక్కువ సమయంలో 20 కేజీలు బరువు తగ్గడంపై ప్రశంసల వర్షం కురిపించారు.అయితే ఉన్నపళంగా విద్యుల్లేఖ బరువు తగ్గడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.అయితే భారీగా బరువు తగ్గడానికి గల కారణాలను తాజాగా విద్యుల్లేఖ వెల్లడించారు.తాను బరువు తగ్గడంలో ఎన్నో మలుపులు ఉన్నాయని, ఎంతో శ్రమ, కష్టం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఒక ఫోటోను చూపిస్తూ ఆ ఫోటో తీసుకున్న రోజు తనకు ఇంకా గుర్తుందని… ఆరోజే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

తాను నటించిన ఒక తమిళ సినిమా ఆడియో వేడుక జరిగే సమయంలో ఆ వేడుకకు తాను హాజరు కావాల్సి ఉందని… అయితే ఆ ఫంక్షన్ కు వెళ్లడానికి సరైన దుస్తులు దొరకలేదని…దాంతో తాను చాలా బాధ పడ్డానని అన్నారు.

సరైన దుస్తులు లేకపోవడంతో పైన కోటు, కింద లెగ్గిన్ వేసుకుని ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యానని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.ఈ ఘటన తనపై తనకే కోపంతో పాటు మానసిక ఒత్తిడిని కూడా పెంచిందని అన్నారు.

ఆ తర్వాత సన్నబడాలని తాను నిర్ణయం తీసుకున్నానని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని వ్యాయామం చేసి బరువు తగ్గానని….

ఆరోజు సరైన డ్రెస్ దొరకకపోవడం వల్లే బరువు తగ్గానని విద్యుల్లేఖ తెలిపారు.నెటిజన్లు స్లిమ్ గా ఉన్న విద్యుల్లేఖ చాలా అందంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube