ఆ ట్రోల్స్ నన్ను బాధించాయి.. ఎమోషనల్ అయిన విద్యుల్లేఖ..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి లేడీ కమెడియన్ గా విద్యుల్లేఖ రామన్ గుర్తింపును సంపాదించుకున్నారు.ఒకప్పుడు బొద్దుగా ఉన్న విద్యుల్లేఖ లాక్ డౌన్ సమయంలో వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గారు.

 Comedian Vidyullekha Raman Comments About Netizens Trolls-TeluguStop.com

అయితే బరువు తగ్గక ముందు, బరువు తగ్గిన తరువాత తనను ట్రోల్ చేసిన వాళ్ల గురించి స్పందిస్తూ విద్యుల్లేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బరువు తగ్గడంతో కొంతమంది కమెడియన్ గా చేయవా.? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఫుడింగ్ అనే సినిమాలో విద్యుల్లేఖ హీరోయిన్ గా నటిస్తున్నారు.

 Comedian Vidyullekha Raman Comments About Netizens Trolls-ఆ ట్రోల్స్ నన్ను బాధించాయి.. ఎమోషనల్ అయిన విద్యుల్లేఖ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లీడ్ రోల్స్ లో తాను నటించాలని భావిస్తున్న సమయంలో ఈ సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆమె తెలిపారు.ఈ సినిమాలో కూడా కామెడీ చేస్తానని ఫుల్ లెంగ్త్ రోల్ లో ఈ సినిమాలో నటిస్తున్నానని విద్యుల్లేఖ వెల్లడించారు.

ఎక్కువ బరువు ఉండటం వల్ల తనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని విద్యుల్లేఖ తెలిపారు.

ఎక్కువ బరువు ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు తనను వేధించడం వల్లే తాను బరువు తగ్గానని విద్యుల్లేఖ రామన్ అన్నారు.

ఎక్సర్ సైజ్ చేయడం ద్వారా తాను బరువు తగ్గానని విద్యుల్లేఖ వెల్లడించారు.లావు తగ్గడంపై నెటిజన్లు చేసిన ట్రోల్స్ విషయంలో విద్యుల్లేఖ ఎమోషనల్ అయ్యారు.సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్ లో విద్యుల్లేఖ రామన్ ఎక్కువగా నటించిన సంగతి తెలిసిందే.

ఫుడింగ్ సినిమా హిట్ అయితే విద్యుల్లేఖ రామన్ హీరోయిన్ ఆఫర్లతో కూడా బిజీ అయ్యే అవకాశం ఉంది.

సంపూర్ణెష్ బాబు, విద్యుల్లేఖ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

#Netizens Trolls #Health Issues #Over Weight #TrollsOn #Lockdown

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు