తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యుల్లేఖ రామన్.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.
చూడటానికి ఎంతో బొద్దుగా ఉండే ఈమె ఒకేసారి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.పైగా ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకోగా పెళ్లి లైఫ్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన హాట్ షోతో బాగా రెచ్చిపోయింది.
కెరీర్ మొదట్లో నాటకాల్లో థియేటర్ ఆర్టిస్టుగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.
ఇక 2012లో ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అదే ఏడాది తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది.
ఇక తెలుగులో పలు సినిమాలలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.సరైనోడు, రాజుగారిగది, రన్ రాజా రన్, డీజే సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈమె ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన భర్త తో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.తాజాగా తన భర్త తో హనీమూన్ కు మాల్దీవులకు వెళ్ళింది.
అక్కడ దిగిన కొన్ని ఫోటోలను బాగా పంచుకుంటుంది.తాజాగా ఓ ఫోటో పంచుకోగా అందులో ఏకంగా అందాలనే ఆరబోసింది.
హాట్ షోతో బికినీలో రెచ్చిపోయింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.