వైరల్‌ : వేణు మాధవ్‌ ఆస్తుల వివరాలు

స్టార్‌ కమెడియన్‌ వేణు మాధవ్‌ చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందాడు.నిన్న యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చనిపోయిన వేణు మాధవ్‌ ఆర్థిక పరిస్థితి గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

 Comedian Venumadhavu Proprities-TeluguStop.com

వేణు మాధవ్‌ మృతి సమయంలో ఆయన తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆయన కుటుంబం పరిస్థితి ఏంటంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

కాని వేణు మాధవ్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా అస్సలు లేదని, ఆయన చనిపోయినా కూడా ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోనక్కర్లేదని ఆయన సన్నిమితులు చెబుతున్నారు.

Telugu Venu Madhavu, Kodada, Telugu Cinima-

  వేణు మాధవ్‌ బతికి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాన్నకు ఇష్టం లేదు.సినిమాలో నటించిన వారు ఆస్తులు ఏమీ కూడబెట్టరు అనే వాడు.అందుకే నేను సంపాదించిన ప్రతి పైసాను ఆస్తులు కొనుగోలు చేస్తూ వచ్చాను.

అందుకే ఇప్పుడు నాకు హైదరాబాద్‌లో 10 ఇళ్లు ఉన్నాయి.అలాగే కరీంనగర్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి, మా సొంత ఊరు కోదాడలో కొంత వ్యవసాయ భూమి ఉందని చెప్పుకొచ్చాడు.

కోట్లల్లో ఆస్తి ఉందని నాలుగు అయిదు సంవత్సరాల క్రితమే వేణు మాధవ్‌ చెప్పాడు.

ఇప్పుడు ఆ ఆస్తి విలువ మరింత పెరిగి ఉంటుంది.

వేణు మాధవ్‌ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో ఎల్‌ఐసీ కూడా వచ్చి ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అందువల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది పడరని అంటున్నారు.

వేణు మాధవ్‌ చాలా తెలివిగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు, ముందస్తుగానే తన కుటుంబం గురించి ఆలోచించారని అంటున్నారు.వేణు మాధవ్‌ ఎన్టీఆర్‌ ఉన్నప్పటి నుండి కూడా తెలుగు దేశం పార్టీలో పని చేశాడు.

ఆ సమయం నుండే ఆస్తులు కూడబెట్టడం మొదలు పెట్టాడు.అందుకే వేణు మాధవ్‌ కుటుంబంకు ఇప్పుడు ఆర్థిక భరోసా కలిగింది.

ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆయన లేని లోటును కుటుంబ సభ్యులకు ఎవరు భర్తీ చేయలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube