త్వరలో హాస్యనటుడు వేణుమాధవ్ విగ్రహావిష్కరణ… ఎప్పుడో, ఎక్కడో తెలుసా…?  

comedian venumadhavs idol unveiled soon do you know when or where venu madhav, statue, cinima industry, health problem, telugu industry, telangana, karimnagar - Telugu Cinima Industry, Health Problem, Karimnagar, Statue, Telangana, Telugu Industry, Venu Madhav

దివంగత టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ విగ్రహాన్ని సెప్టెంబర్ 28న ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ లో పుట్టి ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనేక సినిమాలలో హాస్యాన్ని పంచుతూ తెలుగు అభిమానులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించాడు.

TeluguStop.com - Comedian Venumadhav Idol Unveiled Soon Do You Know When Or Where

చిన్న చిన్న సినిమాలతో తన నట ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత చిన్నగా భారీ సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టాడు.వేణు మాధవ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినా అతి తక్కువ కాలంలోనే టాప్ కమెడియన్స్ లిస్టులో చేరిపోయాడు.

అయితే గత సంవత్సరం ఆయన అనారోగ్యం కారణంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి వైద్యం అందిస్తున్న సమయంలోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.వేణు మాధవ్ భార్య స్వస్థలం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేట లో ఆయన విగ్రహాన్ని సెప్టెంబర్ 28 న ఏర్పాటు చేస్తున్నట్లు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు.

TeluguStop.com - త్వరలో హాస్యనటుడు వేణుమాధవ్ విగ్రహావిష్కరణ… ఎప్పుడో, ఎక్కడో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నట్లు సమాచారం.

ఇక కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా మరికొంత మంది సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వేణు మాధవ్ అనేక సినిమాలలో నటించి అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

అతడు చివరిగా రుద్రమదేవి సినిమాలో నటిస్తున్న సమయంలోనే అనారోగ్య కారణంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ఆ సినిమా నుండి అతను వైదొలిగారు.అలా వైదొలగిన వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయ్యాక చాలా రోజులకు కుదుట పడ్డారు.

అయితే మళ్లీ తిరిగి అనారోగ్యం సహకరించక పోవడంతో తిరిగి కోలుకోలేకపోయారు.

#Telangana #Venu Madhav #Karimnagar #Cinima Industry #Health Problem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Comedian Venumadhav Idol Unveiled Soon Do You Know When Or Where Related Telugu News,Photos/Pics,Images..