Dil Raju Balagam Movie: దిల్ రాజు 'బలగం' చూపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా?

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మాత్రమే కాదు పంపిణీ దారుడిగా కూడా మంచి పేరు ఉంది.

 Comedian Venu To Make His Directorial Debut Under Dil Raju Production, Dil Raju,-TeluguStop.com

ఈయన ఇది వరకు కేవలం మీడియం బడ్జెట్ తో సినిమాలు నిర్మించేవాడు.కానీ ఇప్పుడు మన హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు.

అందుకే దిల్ రాజు కూడా పెద్ద బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్నాడు.మరి దిల్ రాజు ఎంత భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించినా ఆయన దగ్గరకు ఒక మంచి కథ వస్తే మాత్రం దానికి తగ్గ బడ్జెట్ తో తెరకెక్కిస్తారు.

ఇదే ఈయన స్పెషాలిటీ.స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న కదా అని చిన్న చిన్న అప్ కమింగ్ డైరెక్టర్లు మంచి కథలతో వస్తే వారిని రిజక్ట్ చేయకుండా కథ నచ్చితే చాలు ముందుకు వెళతాడు.

మరి ఇప్పుడు దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో ఒక చిన్న సినిమా కూడా ఉంది.మరి ఆ సినిమా ఏంటంటే.‘బలగం‘.టైటిల్ తోనే ఆకట్టు కుంటున్న ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.వేణు కథ చెప్పగానే దిల్ రాజుకు నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Telugu Balagam, Venu, Venudirectorial, Dil Raju-Movie

మరి దిల్ రాజు ఈ సినిమాపై అంత నమ్మకం పెట్టి నిర్మిస్తుంటే ఈ కథలో మ్యాటర్ బాగానే ఉంది అని అందరికి అర్ధం అవుతుంది.వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించాడు.ఇందులో అదిరిపోయే సాంగ్ ఉందని అది మంగ్లీ తో పాడించారని సూపర్ గా వచ్చింది అని టాక్.

మరి దిల్ రాజు ‘బలగం’ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడా అని అందరిలో ఆసక్తి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube