కమెడియన్ ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్‌లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఉత్తేజ్.ఈమధ్య చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తున్నా, ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం తనదైన శైలిని ప్రదర్శి్స్తూ వస్తున్నాడు.

 Comedian Uttej Wife Passes Away-TeluguStop.com

ఉత్తేజ్ ఓ మంచి రచయిత కూడా అనే విషయం మనకు తెలిసిందే.చాలా సినిమాలకు మాటలను కూడా అందించాడు ఉత్తేజ్.

ఇక ఉత్తేజ్ కూతురు చేతన కూడా పలు డ్యాన్స్ కవర్లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఈ క్రమంలోనే ఆమె ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

 Comedian Uttej Wife Passes Away-కమెడియన్ ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.ఉత్తేజ్‌కు మరో కూతురు కూడా ఉంది.

ఉత్తేజ్ సతీమణి పద్మావతి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలుపగా, చికిత్స పొందుతూ వస్తున్నారు.అయితే తాజాగా సోమవారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు.హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటూ వస్తున్నారు.

ఉత్తేజ్ భార్య మృతి పట్లు వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీలో మంచి నటుడిగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఉత్తేజ్‌కు పేరుండటంతో, ఆయన ఇంట్లో నెలకొన్న విషాదానికి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఉత్తేజ్ ఇటీవల ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పనులు ఆయన భార్య చూసుకునేవారు.ఉత్తేజ్ భార్య మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఉత్తేజ్ భార్య భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేసేందుకు తరలివెళ్తున్నారు.

ఉత్తేజ్ భార్య మృతి చెందడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మరియు వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

#Comedian Uttej #Uttej #Uttej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు