చచ్చిపోవాలని విషం తాగాను.. ఆఖరికి నన్ను చూడ్డానికి నా తల్లి కూడా రాలేదు.. కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్?

కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు సినీ ఇండస్ట్రీ వారు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా అతలాకుతలం అయింది.

 Comedian Tirthanand Rao Breaks Silence Suicide Attempt Says He Consumed Poison D-TeluguStop.com

అయితే ఇండస్ట్రీ ని నమ్ముకున్న ఎంతోమంది లాక్ డౌన్ సమయంలో రోడ్డున పడ్డారు.అంతేకాకుండా టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులు, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ఉపాధి లేక అల్లాడిపోయారు.

ఈ క్రమంలోనే చాలామంది బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు.అయితే కరోనా తగ్గుముఖం పట్టాక షూటింగ్ లు మొదలయ్యాయి.

అయినా కూడా కొంతమంది ఆర్టిస్టులకు మాత్రం అవకాశాలు రావడం లేదు.

ఇంకొంత మంది ఆర్టిస్టులకు అవకాశాలు వచ్చినా కూడా డబ్బులు సరిగా చెల్లించడం లేదు.

ఈ క్రమంలోనే ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.అలా ఆర్థిక సమస్యలతో సతమతం అయిన కమెడియన్ తీర్థానంద్‌ రావు కూడా గత నెలలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

అయినవాళ్లు అండగా లేరు అన్న బాధతో, అదేవిధంగా ఆర్థిక సమస్యలతో సతమతమైన అతను డిసెంబర్ 21న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన ఇరుగు పొరుగు వారు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో అతడు చావు నుంచి తప్పించుకొని బయట బతికి బయట పడ్డాడు.

ఇదే విషయంపై తాజాగా తీర్థానంద్‌ స్పందిస్తూ అవును విషయం తాగింది నిజమే నంటూ అంగీకరించాడు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న క్రమంలో కుటుంబం వారు కూడా నన్ను ఒంటరిగా వదిలేయడంతో ఎంతో ఆ బాధను భరించలేక విషం తాగాను అని తెలిపాడు.విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూడా నా తల్లి, సోదరుడు కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.అయితే తీర్థానంద్‌ అతని కుటుంబ సభ్యులు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ అతనితో వారు మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదట.

ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఒంటరిగానే ఉన్నాడట.ఆ క్షణంలో ఇంతకంటే ఘోరమైనది ఇంకేదైనా ఉందా అని అనుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube