పాపం.. సునీల్.. మంగళం శీను.. దెబ్బేసిందే?

పాపం సునీల్ కెరియర్ పాడైపోయింది.ఎవరో ఒకరు కాదు తెలుగు ప్రేక్షకులందరూ ఇదే మాట అనుకుంటున్నారు.

 Comedian Sunil Career Up And Downs Details, Suneel, Comedian Suneel, Hero Offers-TeluguStop.com

కారణం ఎవరో కాదు సునీల్ చేతులారా కెరీర్ నాశనం చేసుకున్నాడు అంటున్నారు ప్రేక్షకులు.మరిముఖ్యంగా అభిమానులు బాధపడిపోతున్నారు.

దీనికి కారణం పుష్ప సినిమాలో సునీల్ మంగళం శీను పాత్రలో నటించడమే.సాఫిగా సాగిపోతున్న కెరియర్లో కాస్త కొత్తగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడో ఏమో.టాప్ కమెడియన్గా కొనసాగుతున్న సమయంలో హీరోగా అవతారమెత్తాడు.కమెడియన్గా ఒక రేంజ్ లో ఉన్న సమయంలోనే హీరో అవ్వాలనే కోరిక మాత్రం అతని ఆపలేకపోయింది.

అందులో తప్పేం లేదు డాన్సులు బాగా చేస్తాడు నటిస్తాడు మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది.ఇక సునీల్ హీరో కావడానికి అడ్డు కేవలం బరువు మాత్రమే.

ఇంకేముంది హీరో అవ్వాలని బలమైన కోరిక ఉండడంతో బరువు తగ్గించి ఆరుపలకల దేహం చూపించాడు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు.కానీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబడ్డాడు.

చివరికి అన్నీ అట్టర్ ఫ్లాప్ లే.చివరికి అవకాశాలు లేని పరిస్థితి.ఇంకేముంది మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తాడు.సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా ఊరుకుంటాడా అంటే.పుష్ప సినిమాలో మంగళం సీను పాత్రలో నటించాడు.ముందుగా ఫస్ట్ లుక్ విడుదల చేయగానే మంగళం శీనుగా సునీల్ పాత్ర అదిరిపోతుంది అనుకున్నారు అందరు.

కానీ పుష్ప సినిమాలో మంగళం సీను పాత్ర ఎందుకు ఉంది అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి.

Telugu Allu Arjun, Suneel, Sunil, Offers, Mangalamseenu, Pushpa, Suneel Career,

తాను ఒక పవర్ఫుల్ విలన్ అని చెప్పుకునేందుకు ఒక్క సీన్ కూడా సునీల్ కు దక్కలేదు.సునీల్ మంగళం సీను పాత్రలో కాస్త అందవిహీనంగా కనిపించాడు.ఉబ్బిన పెదాలతో ముఖం మొత్తం గుంతల తో ఊడిన జుట్టుతో కనిపించాడు సునీల్.

కష్టపడి సునీల్ మంగళం సీను పాత్ర చేస్తే ఇక ఆ పాత్ర బిస్కెట్ అయింది అంటూ ఎంతో మంది ప్రేక్షకులు కూడా కామెంట్లు చేయడం చూశాను.సినిమా చూసిన తర్వాత మంగళం సీను పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా చూపించి చివరికి భార్య చేతిలోకత్తి పోటు గురైనట్లు చూపించడం మాత్రం సునీల్ కి పాత్రని దెబ్బ తీసింది.

Telugu Allu Arjun, Suneel, Sunil, Offers, Mangalamseenu, Pushpa, Suneel Career,

ఇప్పుడు హీరోలు కూడా విలన్ గా మారుతున్నారు.కానీ ఇలా కాదు స్మార్ట్ విలన్ గా మారుతున్నారు.ఇది సునీల్ ఎందుకు గమనించలేకపోయాడు అన్నది ఇప్పటికీ అభిమానులకు తెలియని ప్రశ్న.ఎంత డామేజ్ జరిగిన తర్వాత మళ్లీ కెరీర్ ను ఎలా చక్కదిద్దుకోబోన్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube