హాస్య నటి శ్రీలక్ష్మి ఇప్పటి వరకు ఎంత వెనకేసిందో తెలిస్తే మీరు నమ్మలేరు..!

వెండితెర మీద పైకి నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే హాస్యనటులు నిజ జీవితంలో కూడా అలానే ఉంటారనుకుంటే పొరపాటే.ఎందుకంటే అలా నవ్వించడం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నో ఆఫీసులకి తిరిగుంటారు.

 Comedian Srilakshmi Assets In Movies-TeluguStop.com

తీరా అవకాశం వచ్చి ఒక్కసారి క్లిక్ ఐతే వరుస సినిమాలతో భోజనం తినే తీరిక లేకుండా కష్టపడుతుంటారు.కమెడియన్ వేణుమాధవ్ ఐతే మధ్యాహ్నం పూట తినడానికి టైమ్ లేకపోతే లొకేషన్ కి వెళ్ళేటప్పుడు కారులో తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి.

అలా పరిగెడుతూ ఉండడం కోసం నిత్యం కష్టపడే హాస్యనటులు, రిటైర్మెంట్ టైమ్ కి పొదుపు సొమ్ముతో హ్యాపీగా బతుకుతుంటారు.అయితే ఇలా జరిగేది కేవలం కొందరికి మాత్రమే.

 Comedian Srilakshmi Assets In Movies-హాస్య నటి శ్రీలక్ష్మి ఇప్పటి వరకు ఎంత వెనకేసిందో తెలిస్తే మీరు నమ్మలేరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు నటులకి భవిష్యత్తు గురించి పట్టించుకునేవారు కాదు.తమ కోసం దాచుకోకుండా అడిగిన వారికి దానాలు చేయడం, సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకోవడం వంటివి చేసేవారు.

ఈ కారణంగా బతకడం కోసం చాలా కష్టపడేవారు.రమాప్రభ, శ్రీలక్ష్మి వంటి హస్యనటుల విషయానికి వస్తే వీళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారా అంటే లేరనే చెప్పాలి.

శ్రీలక్ష్మి గురించి చెప్పుకోవాలంటే, ఈమె తండ్రి అమరనాథ్ గారు అప్పట్లో ప్రసిద్ధ హీరో.ఈ విషయం చాలా మందికి తెలియదు.ఆయన హీరోగా నటించిన “అమరసందేశం” సినిమా అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది.ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా చేశారు.

హాస్యనటుడిగా కూడా మారి నవ్వించారు.అలాంటి హాస్యచక్రవర్తి కడుపున పుట్టిన హాస్యపుత్రికే మన శ్రీలక్ష్మి.

నిజానికి ఈమె నటి కావాలని ఏరోజూ అనుకోలేదట.కానీ అనుకోని పరిస్థితుల్లో కావాల్సి వచ్చింది.

దానికి కారణం ఈమె తండ్రికి అవకాశాలు లేకపోవడం.ఒకప్పుడు హీరోగా, హాస్యనటుడిగా ఏలిన అమరనాథ్ గారికి అవకాశాలు రాకపోవడంతో, స్నేహితుల ప్రోద్బలంతో అప్పులు చేసి మరీ “మగవారి మాయలు” అనే సినిమాని నిర్మించారు.

ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.దీని తర్వాత మరో సినిమా తీస్తే, అది కూడా ఫ్లాప్ అయ్యింది.

దీంతో ఈయన ఆస్తి మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది.వీళ్ళది పెద్ద కుటుంబం కావడంతో కుటుంబ భారం మోయడం అమరనాథ్ ఒక్కరి వల్ల సాధ్యపడలేదు.

దీంతో అప్పటికే పెళ్లీడుకు వచ్చిన శ్రీలక్ష్మి ఈ భారాన్ని తన భుజాల మీద వేసుకుంటానని అన్నారు.అయితే ఈ ఫీల్డ్ లో ఆడవాళ్ళని చులకనగా చూస్తారని, అవమానాలు పడాల్సి ఉంటుందని మొదట్లో ఈమె తండ్రి వద్దన్నారు.

కానీ శ్రీలక్ష్మి, అమాయకంగా అలా ఏం ఉండదు, అందరూ చేస్తున్నారుగా అని సినిమాల్లో నటిస్తానని చెప్పారట.తెరపై కనిపించినంత అందంగా తెర వెనుక ఉండదు అని హెచ్చరించినా ఆమె వినలేదట.అమరనాథ్ కూడా సరే నీ ఇష్టం అని వదిలేశారట.అలా శ్రీలక్ష్మి, సినిమాల్లోకి వచ్చారు.మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసిన ఈమె, జంధ్యాల దర్శ్జకత్వంలో వచ్చిన రెండు జెళ్ళ సీత అనే సినిమాలో నటించారు.ఈ సినిమాతో శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది.

ఈమె టాలెంట్ చూసి అప్పటివరకూ చిన్న చిన్న సన్నివేశాలు రాసిన రచయితలు, ఒక్కసారిగా ఆమె కోసం ఎక్కువ సీన్స్ రాసేవారు.అలా ఆమె తన ప్రతిభతో అవకాశాలు దక్కించుకున్నారు.

ఆమె సినిమాల్లో చాలా అమాయకంగా కనబడుతూ నవ్విస్తారు.ఆమె మాట్లాడినా, నటించినా, నవ్వించిన చాలా సహజంగా ఉంటుంది.

ఇంటి పక్కన ఉండే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినట్టే ఉంటుంది.అందుకే ఆమెను ప్రతీ తెలుగు ప్రేక్షకుడూ ఓన్ చేసుకుంటారు.

అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు కదా, బాగానే వెనకేసుకుని ఉండే ఉంటారు అని అనుకుంటారు.

కానీ నిజానికి ఆమె ఆశించినంతగా ఏమీ సంపాదించుకోలేదట.

నిర్మాతలు అడిగినంత పారితోషికం ఇవ్వకపోవడం, సగం పారితోషికమే ఇవ్వడం, చెల్లని చెక్కులు ఇవ్వడం వంటి వాటి వల్ల శ్రీలక్ష్మి చాలా ఇబ్బందులు పడ్డారట.మొదట నుంచి ఈమె మెతక మనిషి వల్ల నిర్మాతల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసుకోవడానికి సాహసం చేసేవారు కాదు.

దానికి తోడు ఈమె ఉన్నది ఉన్నట్టు డబ్బులు ఎగ్గొడుతున్నారు అని వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, అది కొంతమంది నిర్మాతల దృష్టిలో పడడం వల్ల శ్రీలక్ష్మి డబ్బులు గట్టిగా అడగదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి డబ్బులు ఎగ్గొట్టేవారట.ఇలా ఆమె ఎన్ని సినిమాల్లో నటించిన ఎగ్గొట్టే నిర్మాతల వల్ల ఆమె పెద్దగా ఆస్తులు పోగేసుకోలేదట.

మంచి నిర్మాతలు ఇచ్చే డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేదట.ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ లోనూ నటిస్తున్నారు, రీసెంట్ గా లాక్డ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

ఇప్పటికీ బిజీగా ఉన్నా కూడా ఆమె ఆస్తులు పోగేసుకోకపోవడానికి కారణం ఆమె అమాయకత్వమే అని కొంతమంది వాదిస్తారు.డబ్బులు ఇస్తే తీసుకుంటారు, ఎగ్గొడితే అలవాటే అని కాసేపు బాధపడి ఊరుకుంటారట.

దీనికి కారణం అమాయకత్వం కంటే, ఎందుకొచ్చిన గొడవ అని అనుకునే ధోరణి కావచ్చు.పోనీ డబ్బులిస్తేనే చేస్తాను అని ఖచ్చితంగా చెప్పగలిగితే అవకాశాలు వస్తాయో రావో అనే ఒక బెంగ కావచ్చు.

నటన అనేది ఆమెకు పేషన్ అని అర్ధమవుతుంది.అందుకే ఎంతమంది తన శ్రమని దోచుకున్నా ఆమె నటిస్తూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు.

పేరులో లక్ష్మి ఉంది కానీ, ఆమె ఇంట్లో మాత్రం లక్ష్మి లేదనేది వాస్తవం.పైకి ఎంత సంతోషంగా ఉన్నా ఆర్టిస్టులకి తెర వెనుక ఎంతో బాధ ఉంటుందనే విషయం వీళ్ళ జీవితాలని చూస్తే అర్ధమవుతుంది.

#Amarnath #Srilakshmi #Magavari Mayalu #Jamdhyala #Srilakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు