మూడు రోజులు మంచినీళ్లు తాగి బతికిన కమెడియన్..

వినడానికి షాకింగ్ గా ఉంది కదా! అవును నిజంగానే ఈ ఘటన షాకింగ్ ఘటనే.ఇది జరిగింది ఎవరికో కాదు.

 Comedian Satya Shares His Life Journey, Comedian Satya, Vivaha Bhojanambu, Satya-TeluguStop.com

టాలీవుడ్ కమెడియన్ సత్యకి జరిగింది.పేరు చెప్పగానే గుర్తుపట్టలేరు.

కానీ ముఖం చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు.ఎందుకంటే సినిమాల్లో నటించి కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు కాబట్టి.

మంచి నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు.అయితే ఇప్పుడు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఇండస్ట్రీ ప్రారంభ రోజుల్లో ఇలా ఉండదు.

ఎన్నో కష్టాలు చూడాలి అప్పుడే ఎదుగుతారు.

ఇక అలానే ఇప్పుడు మంచి కమెడియన్ గా ఎదిగిన సత్య కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు.

సినిమా దర్శకుడు అవ్వాలనే ఆశతో ఇంజినీరింగ్ ని మధ్యలోనే ఆపేసాడు.అనంతరం హైదరాబాద్ కు వచ్చాడు.అయితే తల్లితండ్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయారు.కానీ ఆలోచనలు మారకపోవడంతో పది వేల రూపాయిలు ఇచ్చి పంపించేశారు.

అయితే ఆ డబ్బులు అన్ని అయిపోవడంతో అద్దాలు తుడిచే పనికి ఒప్పుకోని ఆ పని చేసేవాడట.

Telugu Satya, Satya Journey, Satya Struggles, Tollywood-Movie

నాలుగు రోజులు పని చేసిన తర్వాత రజినీకాంత్ ట్రైలర్ చూపిస్తున్నారని తెలిసి ఓ సినిమాకి వెళ్తే అక్కడ జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విని పలకరించగా షూటింగ్ జరిగే చోటు అడ్రెస్స్ చెప్పగా అక్కడ 500 రూపాయిలు ఇచ్చి షూటింగ్ స్పాట్ కి వెళ్ళాడట.అయితే అక్కడ జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఉండి కొన్ని సినిమాల షూటింగ్స్ కి హాజరు కాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ అతని దగ్గర ఉన్న డబ్బు తీసుకొని పారిపోయాడట.దీంతో అతను దాదాపు మూడు రోజులు తిండి లేకుండా మంచినీళ్లతో బతికాడట.

ఆతర్వాత ఇంట్లోవారికి చెప్తే ఇంటికి తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టినట్టు చెప్పుకోచ్చాడు.ఆతర్వాత సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube