వారి బాటలో సప్తగిరి

తెలుగులో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్స్‌ హీరోలుగా మారిన విషయం తెల్సిందే.కమెడియన్‌గా మంచి గుర్తింపు వచ్చిన ప్రతీ ఒక్క కమెడియన్‌ కూడా కనీసం ఒక్క సినిమాలో అయినా సోలో హీరోగా నటించిన విషయం తెల్సిందే.

 Comedian Sapthagiri To Become Hero?-TeluguStop.com

ఈ ఆనవాయితీ ఎప్పటి నుండో వస్తోంది.ఇటీవలే కమెడియన్స్‌ ధన్‌రాజ్‌ మరియు తాగుబోతు రమేష్‌లు కూడా హీరోలుగా మారిన విషయం తెల్సిందే.

వీరి బాటలోనే మరో కమెడియన్‌ సప్తగిరి హీరోగా మారబోతున్నాడు.

‘ప్రేమ కథా చిత్రం’ సినిమాతో కమెడియన్‌గా ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించిన సప్తగిరి ఇటీవల ప్రతీ చిన్న చిత్రాల్లో కూడా కనిపిస్తూ నవ్విస్తున్నాడు.

ఈయన మాటతీరు మరియు నటనలో కామెడీ ఉంటుంది.దాంతో దర్శకులు ఈయన్ను తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ఈయన చేతిలో పదుల సంఖ్యలో సినిమాలు ఉన్నాయి.మరి కొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

ఇంత బిజీగా ఉన్న సప్తగిరితో ఒక సినిమా నిర్మించేందుకు ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌సంస్థ శ్రేయాస్‌ మీడియా సిద్దం అవుతోంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube