నాకేం బలుపు లేదు, వాటిని నేనేం కాదనుకోవడం లేదు  

Comedian Saptagiri Clarifies About Rumour On Him-rumour On Comedian Saptagiri,telugu Viral In Social Media,tollywiood Gossips

ప్రేమ కథా చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన సప్తగిరి ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. సప్తగిరి హీరోగా ఎప్పటి నుండి అయితే చేస్తున్నాడో అప్పటి నుండి సినిమాల్లో కమెడిన్‌ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి..

నాకేం బలుపు లేదు, వాటిని నేనేం కాదనుకోవడం లేదు-Comedian Saptagiri Clarifies About Rumour On Him

సప్తగిరి కామెడీ పాత్రలు చేయడేమో అంటూ మేకర్స్‌ ఆయన వద్దకు కామెడీ వేశాలతో వెళ్లడం లేదు.

సప్తగిరి కామెడీ వేశాలు వేయకుండా కేవలం హీరోగానే చేయాలనుకోవడం ఆయన అవివేకం అని, అతడి బలుపు కొన్ని రోజుల్లోనే దిగుతుందని, హీరోగా ఎక్కువ కాలం ఆయన రాణించలేదు అంటూ సోషల్‌ మీడియాలో జనాలు ఇష్టం వచ్చినట్లుగా సప్తగిరిని ట్రోల్‌ చేయడం జరిగింది. మీడియాలో వస్తున్న వార్తలకు సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా సప్తగిరి విషయంలో సీరియస్‌గా ఉన్నారు. వారి విమర్శలపై తాజాగా సప్తగిరి స్పందించాడు.

సప్తగిరి హీరోగా రూపొందిన వజ్రకవచధర గోవింద చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తాను హీరోగా అవకాశాలు వస్తున్నాయి కనుక చేస్తున్నాను. అంతే తప్ప నాకు హీరో అవ్వాలనే ఆసక్తి ఏమీ లేదన్నాడు. ఇదే సమయంలో తాను కమెడియన్‌గా కూడా చేయాలనుకుంటున్నాను. కాని కొందరు నాకు కమెడియన్‌గా చేసేందుకు ఆసక్తి లేదంటూ ప్రచారం చేస్తున్నారు.

నాకు బలుపు ఉందని, దాంతోనే హీరోగా చేయాలని భావిస్తున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. వారికి నేను ఇచ్చే సమాధానం ఒకటే. నాకు బలుపు లేదు, నేను కామెడీ పాత్రలు చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నా గురించి తప్పుడు ప్రచారం చేయవద్దు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడైనా మనోడికి కామెడీ పాత్రలు వస్తాయేమో చూడాలి.