ఆ కారణంతో పృథ్వీకి టాలీవుడ్‌ బైబై చెబుతుందా?

కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో పృథ్వీ నటించి నవ్వించాడు.ఆయన 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చెప్పిన డైలాగ్‌ రెండు దశాబ్దాలు అయినా ఇంకా మారుమ్రోగుతూనే ఉంది.

 Comedian Pruthvi Leavein Cinimafield-TeluguStop.com

బ్రహ్మానందం సైడ్‌ అయిన సమయంలో పృథ్వీకి మంచి స్కోప్‌ దక్కింది.ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పృథ్వీ కామెడీ పండించాడు.

ఎక్కువ పేరడీలు చేసి నవ్వించిన పృథ్వీ మెల్ల మెల్లగా సినిమా పరిశ్రమకు దూరం అవుతున్నట్లుగా అనిపిస్తుంది.కొందరు పృథ్వీని సినిమా పరిశ్రమ దూరం పెడుతుందని కూడా అంటున్నారు.

ఆ కారణంతో పృథ్వీకి టాలీవుడ్‌

అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు సినిమా ఇండస్ట్రీ నుండి మద్దతు ఇచ్చిన వారిలో ముఖ్యుడు పృథ్వీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.దాదాపు నెల రోజుల పాటు పృథ్వీ కష్టపడి వైకాపా తరపున ప్రచారం చేయడం జరిగింది.ఆ కష్టంకు జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రతిఫలం అన్నట్లుగా ఆయనకు ఎస్వీబీసీకి చైర్మన్‌గా చేయడం జరిగింది.మొన్నటి వరకు రాఘవేంద్ర రావు నిర్వహించిన విధులను ఇప్పుడు పృథ్వీ నిర్వహిస్తున్నాడు.

ఇదే సమయంలో ఆయన సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాడు.

ఆ కారణంతో పృథ్వీకి టాలీవుడ్‌

పృథ్వీ సినిమాలు చేయాలనుకున్నా కూడా ఆయనకు అవకాశాలు రావడం లేదు.వచ్చిన అవకాశాలు కూడా చేజారి పోతున్నాయి.అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాల్సిందిగా కొందరు నిర్మాతలు ఆయన వద్దకు వెళ్లగా మరి కొందరు మాత్రం తామిచ్చిన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వనక్కర్లేదు, కాని మీరు మా సినిమాలో నటించడం లేదని చెబుతున్నారట.

సినిమా పరిశ్రమ వారికి జగన్‌ సీఎం అవ్వడం ఇష్టం లేదు అంటూ పృథ్వీ వ్యాక్యలు చేయడం వల్ల చాలా మంది సినీ ప్రముఖులు ఇబ్బంది పడుతున్నారు.మరో వైపు పదే పదే పవన్‌ కళ్యాణ్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులను టార్గెట్‌ చేస్తున్న నేపథ్యంలో ఇక పృథ్వీని తమ సినిమాల్లోకి తీసుకునే సాహసం చేయడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube