'పవన్ కళ్యాణ్'పై షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ రాజ్..?

తెలుగు సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ పరిచయం గురించి తెలీనోలే లేరు.ఎందుకంటే ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగుతో బాగా పాపులర్ అయ్యాడు.ఎప్పటినుండో సినీరంగంలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.1993లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా లో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో బాగా నవ్వించాడు.సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయాలలో కూడా చేరాడు పృథ్వీరాజ్.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ చేశాడు పృథ్వీ.

 Comedian Prudhvi Raj Shocking Comments On Pawan Kalyan Character-TeluguStop.com

రాజకీయాల్లోకి అడుగు పెట్టగా మరి ఇంత బిజీ గా మారాడు.

అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు.ఇక ఆయనకు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కూడా అప్పగించాడు.

 Comedian Prudhvi Raj Shocking Comments On Pawan Kalyan Character-పవన్ కళ్యాణ్’పై షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ రాజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ పలు స్టార్ హీరో లను కూడా తనదైన శైలిలో తెగ కామెంట్స్ చేసేవాడు.అంతే కాకుండా తనతో పాటు ఇంకొంత మంది ఆర్టిస్టులను కూడా వైసీపీ పార్టీలోకి చేర్చాడు.

Telugu Comedian Prudhvi Raj, Pawan Character, Pawan Kalyan, Shocking Comments-Movie

తన రాజకీయాల కారణంగా పలు సినిమాలలో అవకాశాలను కోల్పోగా చిరంజీవి మద్దతుతో మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు.ఇక పవన్ పై ఎన్నికల సమయంలో మరింత రెచ్చిపోయి అతని పై తీవ్ర విమర్శలు చేశాడు.అప్పటికే ఎస్వీబీసీ భక్తి ఛానల్ లో చైర్మన్ గా బాధ్యతలు అందుకోగా ఓ వివాదం కారణంగా ఆయనని తొలగించారు.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తన దూకుడును తగ్గించాడు.

మొత్తానికి ఆయనను ఉద్దేశిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై మరో షాకింగ్ కామెంట్స్ చేశాడు పృథ్వీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ పవన్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఆయన సినిమాలు చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు అంటూ అందులో అసలు తప్పేముంది అని అన్నాడు పృథ్వీ.

అది ఆయన వృత్తి అంటూ ప్రజల మీద దృష్టి ఎక్కువ అంటూ అందుకే వాళ్ల తరఫున పోరాడుతున్నాడని తెలిపాడు.అంతే కాకుండా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్న మాట నిజమే కానీ ఎవరి దుకాణం వాళ్ళది అంటూ కామెంట్స్ చేశాడు.

#Pawan Character #ComedianPrudhvi #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు