ఆ నిర్మాత గురించి తెలిసి కూడా..ఆమె గెస్ట్ హౌస్ కి ఎందుకెళ్లింది.?- పృద్వి సంచలన కామెంట్స్.!       2018-07-01   23:35:23  IST  Raghu V

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ని కాస్టింగ్ కౌచ్ ఎంతగా పట్టి పీడిస్తుందో అందరికి తెలిసిందే. దీనిపై చాలా మంది నటులు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృద్వి కూడా ఈ విషయంపై ఇటీవలే స్పందించారు. అయితే ఆయన స్పందించిన తీరు కొంచెం కొత్తగా ఉంది. ఆయన ఏమన్నారో అంటే.?

”సినిమా కోసం నిర్మాత కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు.. అలాంటిది కథకు సరిపోయే హీరోయిన్ ను మాత్రమే ఆయన తీసుకుంటారు. మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ లాంటి అమ్మాయిని కథకు సెట్ అవుతుందనే తీసుకొచ్చారు. ఇక్కడున్న వాళ్లతో ఆ పాత్ర చేయించలేమని అన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా రాణించారు. ఇప్పుడు టాప్ హీరోల సరసన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండి” అంటూ ఎదురు ప్రశ్నించారు.

అలానే సినిమా ఇండస్ట్రీ పరువు పోయేలా కొందరు ఆర్టిస్టులు వ్యవహరిస్తుండడం బాధాకరమని అన్నారు. ఓ సినీ నిర్మాత గురించి గతంలో ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.. ఆమెను ఉద్దేశిస్తూ పృధ్వీ ప్రొడ్యూసర్ గురించి తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఇలా కొందరు చేస్తోన్న కామెంట్ల కారణంగా జనాల్లో సినిమా వాళ్లంటే చులకన భావం ఏర్పడిందని అన్నారు.