జగన్ ని నమ్ముకున్నందుకు 30 ఇయర్స్ పృథ్వికి జాక్ పాట్  

Comedian Prudhvi Appointed As Svbc Chairman-

ఏపీ రాజకీయాలలో అందరికంటే ముందుగా వైసీపీతో జగన్ వెంట నడిచిన సినిమా నటుడు 30 ఇయర్స్ పృథ్వి.జగన్ తో పాటు నడిచి, వైసీపీ తరుపున మీడియాలో కూడా గట్టిగా తన మాటలు వినిపించిన వ్యక్తి.సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఉంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా సంచలన వాఖ్యలు చేసారు.పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ గా విమర్శలు చేసారు...

Comedian Prudhvi Appointed As Svbc Chairman--Comedian Prudhvi Appointed As SVBC Chairman-

దీనిపై మెగా ఫాన్స్ నుంచి విమర్శలు వచ్చిన కూడా జగన్ తరుపున నిలబడి వైసీపీ కోసం ప్రచారం కూడా చేసారు.ఇక పృథ్వి సేవలు గుర్తించిన జగన్ అతనికి పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా కూడా కట్టబెట్టారు.ఎన్నికలలో పోటీ చేసే అవకాశం మాత్రం పృథ్వికి రాలేదు.

ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత మెగా ఫ్యామిలీని విమర్శించడం వలన అతనికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిన కూడా వైసీపీ తరుపున రాజకీయంగా తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు.ఇండస్ట్రీలో జనాల మీద కూడా పృథ్వి ఒకానొక దశలో విమర్శలు చేసారు.ఇక జగన్ కి ఇంత అండగా నిలబడినందుకు అతనికి జగన్ సముచిత స్థానం కల్పించారు.

Comedian Prudhvi Appointed As Svbc Chairman--Comedian Prudhvi Appointed As SVBC Chairman-

పృథ్విని పిలిచి మరీ శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ ని నిమనించారు.దీనికి సంబంధించి సెక్రటేరియట్ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన వెంటనే పృథ్వి జగన్ ని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో భక్తి చానల్ చైర్మన్ పదవిలో దర్శక దిగ్గజన కె రాఘవేంద్రరావు ఉన్నారు.

ఇప్పుడు ఆ స్థానం పృథ్వికి ఇవ్వడం ద్వారా తనని అభిమానించే వారిని జగన్ అందలం ఎక్కిస్తాడు అని మరో సారి రుజువైంది.