2020లో పైనొకటి కిందొకటి అంటోన్న కమెడియన్

టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి పెళ్లిచూపులు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్వించడంలో తనదైన మార్క్ వేసుకున్నాడు ఈ కమెడియన్.

 Comedian Priyadarshi Post Goes Viral, Priyadarshi, Mallesham, Corona, Lockdown,-TeluguStop.com

ఇక ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ప్రియదర్శి.ఇక హీరోగా కూడా మల్లేశం వంటి సినిమాలో నటించి మెప్పించాడు ప్రియదర్శి.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ కమెడియన్, తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

ప్రియదర్శి పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించే ఈ కమెడియన్, సోషల్ మీడియాలోనూ తనదైన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.కరోనా కష్టకాలం కావడంతో దాదాపు మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయిన ప్రియదర్శి కేవలం రెండే రెండు వస్త్రాలు ధరించాడట.

‘ఇన్ని రోజులుగా నాకు అండగా నిలుస్తున్నాయి ఇవే’ అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ప్రియదర్శి పెట్టిన పోస్టుకు నెటిజన్లు కూడా కడుపుబ్బా నవ్వుకోవడమే కాకుండా దానిని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఏదేమైనా ప్రియదర్శి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఏదేమైనా ఇలాంటి పోస్టులు పెట్టడంతో తమ ఫ్యాన్స్‌ను కష్టకాలంలో కూడా నవ్విస్తున్నారు ఇలాంటి కమెడియన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube