ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టేందుకు ప్రభాస్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడిగాడు...

తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు శోభన్ దర్శకత్వం వహించిన “వర్షం” చిత్రం ద్వారా నటుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్ శీను గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాస్ శీను పలు చిత్రాలలో కమెడియన్ గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి బాగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.

 Comedian Prabhas Sreenu About Tollywood Young Rebel Star Prabhas-TeluguStop.com

 తాజాగా ప్రభాస్ రాజు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని హీరో ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా ప్రభాస్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో అయినప్పటికీ తన స్నేహితులు మరియు సన్నిహితులతో లేదా ఇతర నటీనటులతో చాలా గౌరవంగా, మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చాడు.

 Comedian Prabhas Sreenu About Tollywood Young Rebel Star Prabhas-ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టేందుకు ప్రభాస్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడిగాడు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ మధ్య ప్రభాస్ అడవి రాముడు చిత్రంలో హీరోగా నటిస్తున్న సమయంలో ఓ ముద్దు సన్నివేశంలో నటించడానికి అనుమతి కోసం తన తండ్రికి ఫోన్ చేసి అడిగాడని అంతగా తన తల్లిదండ్రులని ప్రభాస్ గౌరవిస్తాడని తెలిపాడు.ప్రభాస్ తండ్రి కూడా సినిమాలోనే కాబట్టి ఫర్వాలేదు ముద్దు పెట్టెయమని చెప్పాడట.

Telugu Comedian Prabhas Sreenu About Tollywood Young Rebel Star Prabhas, Prabhas, Prabhas Sreenu About Prabhas, Prabhas Sreenu About Prabhas Family, Tollywood, Tollywood Young Rebel Star-Movie

అలాగే ఎవరు ఎక్కడ ఉన్నా సరే దీపావళి పండుగ రోజున మాత్రం ప్రభాస్ తండ్రి కృష్ణం రాజు అందరికీ పలు బహుమతులు మరియు టపాసులు కచ్చితంగా పంపిస్తాడని, ఇంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున దీపావళి పండుగను అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకొచ్చాడు.అయితే ప్రభాస్ కి తన ఎమోషన్స్ ని వ్యక్త పరచడం రాదని అందువల్లే ఏ విషయాన్ని కూడా అంత తొందరగా  చెప్పలేడని కూడా చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ శీను తెలుగులో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు.ఇటీవలే అల్లరి నరేష్ హీరోగా నటించిన “బంగారు బుల్లోడు” అనే చిత్రంలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో నటించాడు.

 కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

#PrabhasSreenu #Prabhas #TollywoodYoung #PrabhasSreenu #ComedianPrabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు