సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు.అలాంటి నటుల్లో నగేష్ ఒకరు ఆయన రైల్వేలో జాబ్ చేస్తూ సినిమాల మీద ఉన్న ఇంటరెస్ట్ తో నాటకాలు వేస్తూ ఉండేవారు అలా ఒకరోజు రైల్వే ఉద్యోగుల కల్చరల్ సొసైటీ లో నాటకం వేస్తే ఆరోజు స్టార్ హీరో అయినా ఎంజీఆర్ ఆయన నటనని చూసి నువ్వు ఫ్యూచర్ లో మంచి నటుడివి అవుతావు అని ప్రశంసలు కురిపించారు.
తర్వాత నగేష్ సినిమాల్లోకి వచ్చి సర్వర్ సుందరం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు.నగేష్ కి జోడిగా ఎంతమంది నటించిన ఆయన నటన మాత్రం అద్భుతంగా ఉండేది కానీ ఆయనతో పాటు జోడిగా మనోరమ నటించినప్పుడు మాత్రం ఇద్దరి జోడి చూసే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేది.
దాంతో చాలా సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో నగేష్ ఎక్కువగా నటించలేదు.
మనోరమ చేస్తుంది అంటే చాలు ఆ సినిమాలను నగేష్ వదులుకునేవాడు అలా చాలా సినిమాలని వదిలేసుకున్నారు.అయితే కొన్ని రోజుల తర్వాత ఎంజీఆర్ మనోరమని నగేష్ ని కలిపాడు.కొన్నిరోజుల తర్వాత నగేష్ కి ఎంజీఆర్ కి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఎంజీఆర్ తన సినిమాలతో పాటు తమిళంలో చేసే చాలా సినిమాల్లో నగేష్ గారికి అవకాశం లేకుండా చేశాడు.దీంతో నగేష్ తెలుగు, మలయాళ భాషల్లో నటించడం మొదలు పెట్టాడు.
కమల్ హాసన్ తో మంచి సన్నిహిత్యం ఉండడంవల్ల కమలహాసన్ నగేష్ గారిని ఎంత రికమండ్ చేసిన తమిళంలో ఉండే దర్శకనిర్మాతలు తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు.కమల్ హాసన్ హీరోగా వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాలో నగేష్ మందు తాగుతూ చేస్ అని చెప్పే డైలాగ్ అప్పటి యూత్ కి బాగా నచ్చడంతో నగేష్ కు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి.
అప్పటివరకు కామెడీ పాత్రలు చేసిన నగేష్ కి కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన విచిత్ర సోదరులు సినిమా లో విలన్ పాత్ర ఇవ్వడం ఆ పాత్రలో నగేష్ తన విలనిజాన్ని కొత్తగా చూపించడంతో జనాలందరికీ ఆయన నటన విపరీతంగా నచ్చింది.ఈ సినిమా తెలుగులో లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా హిందీలో కూడా డబ్ అయి మంచి విజయం సాధించింది.నగేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు దాంతో హిందీలో కొన్ని సినిమాలు చేశారు.పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ పెదనాన్న గా నగేష్ నటించి కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా చాలా బాగా నటించారు.
నగేష్ కి రెజీనా అనే క్రిస్టియన్ అమ్మాయి తో పెళ్లి జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో ఆనంద్ అనే అబ్బాయిని హీరోగా నగేష్ పరిచయం చేసినప్పటికీ అతను పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రంలో చివరిసారిగా నగేష్ కనిపించారు.
అయితే నగేష్ కి ఒక సినిమా థియేటర్ కూడా ఉండేది ఆ సినిమా థియేటర్ కి సంబంధించిన పన్ను కట్టలేదని అప్పటి సీఎం అయిన ఎంజీఆర్ నగేష్ నీ జైలుకు కూడా పంపించాడు.అయితే చివరి స్టేజ్ లో నగేష్ కి అవకాశం సరిగా లేకపోవడంతో చైన్ స్మోకర్ గా మారి, విపరీతంగా మందు తాగడం వల్ల అనారోగ్యానికి గురై మరణించారు.
మొత్తానికి నగేష్ గారు అటు కామెడీ చేస్తూ, విలన్ పాత్రలు వేస్తూ, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించేవారు.కానీ ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో నగేష్ గారిలా నటించే నటుడు ఇకమీదట రాకపోవచ్చు అని అంటుంటారు.