ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవకు వచ్చారని భయపడ్డాను.. నటుడి కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించిన నటించిన అరవింద సమేత వీర రాఘవ బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో పాటు 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.కమెడియన్ మాణిక్ రెడ్డి ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు.

 Comedian Manik Reddy Comments About Young Tiger Junior Ntr , Aravinda Sametha, J-TeluguStop.com

తాజాగా మాణిక్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని మాణిక్ రెడ్డి తెలిపారు.

అరవింద సమేత తర్వాత తనకు ఆఫర్లు పెరుగుతాయని సెట్ లో ఉన్నవాళ్లు చెప్పారని ఆ తర్వాత నిజమైందని మాణిక్ అన్నారు.అరవింద సమేత సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంటిముందు జమయ్యారని తన ఇంటిపైకి వచ్చి గొడవ చేస్తారేమో అని తాను టెన్షన్ పడ్డానని మాణిక్ రెడ్డి తెలిపారు.

అందరూ కిందకు రండి అనడంతో కొడతారేమో అని అనిపించిందని మాణిక్ పేర్కొన్నారు.

అరవింద సమేత సినిమాలో మూడు డైలాగులు మాత్రమే చెప్పడంతో ఆ సినిమాలో తన పాత్ర భారీ రెస్పాన్స్ అందుకుంటుందని అనుకోలేదని మాణిక్ తెలిపారు.

కిందకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారని తన పర్ఫామెన్స్ అదిరిపోయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారని మాణిక్ చెప్పుకొచ్చారు.కొంతమంది తన సీన్ వచ్చినప్పుడు వేసిన కేకలకు సంబంధించిన వీడియోలను పెట్టారని మాణిక్ రెడ్డి అన్నారు.

తన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.అరవింద సమేత సినిమాకు ముందు కొన్ని సినిమాలలో తాను నటించినా ఆ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు దక్కలేదని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.తనకు దైవభక్తి ఎక్కువని రోజూ 2 గంటల పాటు పూజ చేస్తానని మాణిక్ రెడ్డి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube