కళ్లు చిదంబరం కన్నుమూత

ప్రముఖ తెలుగు కమెడియన్‌ కళ్లు చిదంబరం నేడు విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.గత కొంత కాలంగా శ్వాస కోశ వ్యాదితో బాదపడుతున్న ఈయన గత రెండునెలలుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు.

 Comedian Kallu Chidambaram Died-TeluguStop.com

తాజాగా ఆయన పరిస్థితి మరింతగా విషమించడంతో కన్నుమూశారు.ఎన్నో సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం 70 సంవత్సరాల వయస్సులో తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు.

నాటక రంగంలో దాదాపుగా 15 సంవత్సరాల పాటు సేవలందించిన ఈయన 1988లో ‘కళ్లు’ అనే సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే ఈయనకు నంది అవార్డు దక్కింది.

దాంతో ఒక్కసారిగా బిజీ అర్టిస్టు అయ్యాడు.ఈయన దాదాపుగా 300లకు పైగా చిత్రాల్లో కామెడీ పాత్రలు చేశాడు.

ఈయన చేసినవన్నీ కూడా కామెడీ పాత్రలు కావడం విశేషం.కళ్లు చిదంబరం మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు తమ ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు, ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపంను తెలియజేశారు.రేపు చిదంబరం అత్యక్రియలను విశాఖపట్నంలోనే నిర్వహించనున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube