వర్షతో రొమాన్స్ ఒక్కటే కాదు.. ఇమ్మానుయేల్ మరో కోణం బయటపడటంతో హైపర్ ఆది?

ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పరిచయం అయిన ఇమ్మానుయేల్.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు అందుకున్నాడు.

 Comedian Hyper Aadi Shocked With Emmanuel Singing Performance On Sri Devi Drama Company-TeluguStop.com

జబర్దస్త్ వేదికగా తన సొంత టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.ముక్కు అవినాష్ స్థానంలో వచ్చిన ఇమ్మానుయేల్‌‌.

కెవ్వు కార్తిక్ టీం లో కీలక పాత్ర చేస్తున్నాడు.అంతేకాకుండా పలు టీం లలో కూడా చేస్తున్నాడు.

 Comedian Hyper Aadi Shocked With Emmanuel Singing Performance On Sri Devi Drama Company-వర్షతో రొమాన్స్ ఒక్కటే కాదు.. ఇమ్మానుయేల్ మరో కోణం బయటపడటంతో హైపర్ ఆది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈయనకు ఇంత తక్కువ సమయంలో క్రేజ్ రావడానికి కారణం.తన శరీరం రంగు ఒకటైతే.తన పక్కన నటించే లేడీ కమెడియన్ వర్ష మరో కారణం.ఎంతో అందంగా ఉండే వర్ష.

ఇమ్మానుయేల్‌‌ తో జత కట్టి స్కిట్ లు చేయడం వల్ల.పైగా వారిద్దరి మధ్య రొమాన్స్ కూడా హైలెట్ గా మారడంతో మొత్తానికి అతడు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

వీరిద్దరూ కలిసి జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోలలో కూడా జంటగా, తమ రొమాంటిక్ మూమెంట్ లతో బాగా ఆకట్టుకుంటారు.

ఇక ఇమ్మానుయేల్‌‌ ప్రస్తుతం మరో బుల్లితెర ప్రోగ్రాం లో కూడా బిజీగా ఉన్నాడు.

ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో చేస్తున్నాడు.ఇక ఈ షోలో ఇమ్మానుయేల్‌‌ తన కామెడీ సీన్స్ తో బాగా ఆకట్టుకుంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.అందులో మదర్స్ డే సందర్భంగా.‘పెదవే పలికిన మాట’ అనే అమ్మ పాట పాడడమే కాకుండా.అందులో ఫిమేల్ వాయిస్ తో కూడా బాగా పాడాడు.

తన ఫిమేల్ గొంతు విని అక్కడున్నవారంతా షాక్ అవ్వడంతో.హైపర్ ఆది తన టాలెంట్ ను చూసి నీది మామూలు టాలెంట్ కాదురా బాబు అంటూ అతడిని హత్తుకున్నాడు.

#Mothers Day #SrideviDrama #SrideviDrama #Hyper Aadi #Emmanuel Talent

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు