జబర్దస్త్ లో ఛాన్స్ అడిగితే అలా చెబుతారట.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన షోగా మంచి పేరును సంపాదించుకుంది.ఈ షోలో టీమ్ లీడర్ల పారితోషికాలు లక్షల్లో ఉంటే కంటెస్టెంట్ల పారితోషికాలు కూడా బాగానే ఉంటాయి.

 Comedian Harsha Shocking Comments About Jabardasth, Comedian Harsha, Interesting-TeluguStop.com

జబర్దస్త్ లో స్కిట్లు చేసిన కమెడియన్లలో ఒకరైన హర్ష తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ టీమ్ లో సెలెక్టెడ్ ఆర్టిస్ట్ లు ఉంటారని టీమ్ లీడర్లకు ఒక్కొక్క స్కిట్ కు చెక్ ఇస్తారని చెప్పారు.

వారానికి ఒక షెడ్యూల్ ఉంటుందని ఫ్రైడే రోజు జబర్దస్త్ షూట్ జరిగిందనుకుంటే రెండు ఎపిసోడ్ల షూటింగ్ జరుగుతుందని షెడ్యూల్ అయిపోగానే రెండు ఎపిసోడ్ల చెక్కులు టీమ్ లీడర్ కు ఇస్తారని టీమ్ లీడర్ ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్లకు పేమెంట్స్ వస్తాయని అప్ కమింగ్ వాళ్లకు ఎలా ఉంటుందంటే ఛాన్స్ కావాలా.? అమౌంట్ కావాలా.? అని అడిగే పరిస్థితి ఉంటుందని హర్ష తెలిపారు.

ఛాన్స్ కావాలని అడిగితే వెయిట్ చెయ్యి ఛాన్స్ ఇస్తామని చెబుతారని అమౌంట్ కావాలని అంటే డోర్ అక్కడుంది వెళ్లిపో అనేలా అక్కడ పరిస్థితి ఉంటుందని హర్ష తెలిపారు.

తాను ఉదాహరణ చెబుతున్నానని హర్ష అన్నారు.తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని పవన్ కు డై హార్డ్ ఫ్యాన్ అని హర్ష తెలిపారు.ఫేవరెట్ హీరోయిన్ రాశీఖన్నా అని హర్ష వెల్లడించారు.

చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారని హర్ష పేర్కొన్నారు.

మా ఏరియాలో వినాయక చవితి బాగా చేస్తారని హర్ష తెలిపారు.యాక్టింగ్, సింగింగ్ తన హాబీస్ అని హర్ష వెల్లడించారు.సినిమాల్లోనే నటించాలని ఏమీ లేదని గుర్తింపు రావాలని అనుకుంటే ఏ పాత్ర వచ్చినా చేయాలని హర్ష చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ షో రెమ్యునరేషన్ల గురించి, స్కిట్లలో ఛాన్స్ గురించి హర్ష చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube