హీరో అయిపోయిన మరో కమెడియన్..!  

Jabardasth Comedian Getup Srinu Turns Hero, Getup Srinu new Movie Launch, Hyderabad, Getup Srinu, Getup Srinu as hero, Jabardasth Show - Telugu Getup Srinu, Getup Srinu As Hero, Getup Srinu New Movie Launch, Hyderabad, Jabardasth Comedian Getup Srinu Turns Hero, Jabardasth Show

బుల్లితెర పై తెలుగు ప్రేక్షకులను అందరినీ కడుపుబ్బ నవ్వించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే జబర్దస్త్ షో అని అందరూ టక్కున చెప్పేస్తారు.ఈ జబర్దస్త్ షో లో కామెడీ సీన్స్ చేసే వ్యక్తి హీరోగా మారడం ఎప్పటి నుంచో మనం గమనిస్తూనే ఉన్నాం.

TeluguStop.com - Comedian Getup Srinu New Movie Launch

తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ హీరోగా అయ్యేందుకు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే జబర్దస్త్ షోలో బాగా ఆకట్టుకున్న షకలక శంకర్ సినిమాలు చేస్తూ హీరోగా ముందుకు కొనసాగుతున్నాడు.

సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా అవి ఏమీ ఆలోచించకుండా సినిమాలు చేసేందుకు మక్కువ చూపుతున్నాడు.మరోవైపు సుడిగాలి సుదీర్ కూడా హీరోగా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

TeluguStop.com - హీరో అయిపోయిన మరో కమెడియన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు సహస్ర తో పాటు మరో రెండు సినిమాలలో సుధీర్ నటించేందుకు సిద్ధమయ్యాడు.ప్రస్తుతం గెటప్ శీను కూడా హీరోగా నటించేందుకు సిద్ధం అయ్యాడు.

గెటప్ శీను హీరోగా ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఈ సినిమాకు సాయి వరుణ్ అభి క్రియేషన్స్ బ్యానర్ పై రాజు యాదవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు .ఇక ఈ సినిమాకు ఐఐటీ మద్రాస్ లో ఇంటర్నేషనల్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసి ఫెర్రర్ స్పెషాలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో గెటప్ శ్రీను సరసన అంకిత కారత్ నటిస్తుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయింది.ఇక హీరో హీరోయిన్ల పై చిత్రీకరణ ముహూర్తపు సన్నివేశాన్ని దర్శకుడు సాగర్ కే చంద్ర క్లాప్ కొట్టాడు.ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ సూడో రియలిజం జానర్‌ లో, ఒక టౌన్ బ్యాక్‌ డ్రాప్‌ లో నడిచే సినిమా సహజమైన పాత్రలతో ఆర్గానిక్ మేకింగ్ తో ఉంటుందని తెలిపారు.ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.

కమర్షియల్ హంగులకు దూరంగా, సమాజంలో మనం చూసే ఎన్నో పాత్రలకు, వాస్తవికతకు దగ్గరగా, వైరుధ్య మనస్తత్వాలు, వారి ఊహలు, కోరికలు, ప్రయాణం, చివరగా డెస్టినీ ఏమిటనేదే విధాంగా ఉంటుంది అని అయినా పేర్కొన్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ తొలి వారంలో మొదలవబోతోంది.

సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక గెటప్ శీను హీరోగా వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో మరి చూడాలి ఇక.

#Hyderabad #GetupSrinu #Jabardasth Show #GetupSrinu #Getup Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Comedian Getup Srinu New Movie Launch Related Telugu News,Photos/Pics,Images..