చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ కామెడీ హీరో ఆ విధంగా వాడేసారు.

ఈ మధ్యకాలంలో పాత హిట్ మూవీస్ కి సంబందించిన టైటిల్స్ ని మళ్ళీ కొత్త సినిమాల కోసం వాడేసుకుంటున్నారు.రీసెంట్ గా తమిళ్ హీరో కార్తి తన డబ్బింగ్ సినిమాలకి ఖైదీ, దొంగ అనే టైటిల్స్ పెట్టి రిలీజ్ చేశాడు.

 Comedian Gets Mega Star's Title, Comedian Srinivasa Reddy, Dheekshith Shetty, Ve-TeluguStop.com

ఈ రెండు కూడా చిరంజీవి సూపర్ హిట్ మూవీస్ కావడం విశేషం.అలాగే గతంలో అల్లరి నరేష్ యముడికి మొగుడు అంటూ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

అలాగే నాని గ్యాంగ్ లీడర్ తో కామెడీ థ్రిల్లర్ కథతో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు.రుస్తుం టైటిల్ ని కూడా ఓ సినిమా కోసం మళ్ళీ వాడేసారు.

ఇలా ముఖ్యంగా చిరంజీవి హిట్ సినిమాల టైటిల్స్ ని పెట్టుకుంటూ ఈ జెనరేషన్ లో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు.అలా పెట్టుకోవడం వలన తమ సినిమాకి కూడా హైప్ వస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.

కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈవీవీ సూపర్ హిట్ మూవీ జంబలకిడిపంబ అనే టైటిల్ వాడేసి హర్రర్ కామెడీ సినిమా చేశాడు.అది డిజాస్టర్ అయ్యింది.అయితే ఇప్పుడు చిరంజీవి త్రిపత్రాభినయం చేసిన సూపర్ హిట్ మూవీ ముగ్గురు మొనగాళ్ళు.ఇప్పుడు ఇదే టైటిల్ తో శ్రీనివాసరెడ్డి మెయిన్ లీడ్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.

దీనికి సంబందించిన పోస్టర్ ని కూడా తాజాగా లాంచ్ చేశారు.ఇక ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డితో పాటు కన్నడ దియా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

అలాగే వెన్నెల రామారావు మరో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతున్న ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

మరి ఈ సినిమా అయిన హిట్ అయ్యి టైటిల్ కి ఉన్న క్రేజ్ ని నిలబెడుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube