శేఖర్ మాస్టర్ ను కొట్టిన కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి... కారణం అదేనా?

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్ ధమాకా కార్యక్రమానికి నాగబాబుతో పాటు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Comedian Express Hari Beat Shekhar Master Do You Know The Reason , Express Hari-TeluguStop.com

ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను తన అద్భుతమైన కామెడీ స్కిట్ల ద్వారా సందడి చేస్తోంది.

ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా నాగబాబు రెచ్చిపోతూ ప్రతి టీం లీడర్ ని, కంటెస్టెంట్ లను వాయించి పెట్టారు.ఇలా అందరినీ కర్రలతో చితకబాదుతూ వారిలో వారికి గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు.

ఇకపోతే కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి తన టీమ్ కి మధ్య గొడవ పెట్టారు.అయితే ఈ గొడవలో భాగంగా ఎక్స్ ప్రెస్ హరి శేఖర్ మాస్టర్ పై దాడి చేశారు.

నాగబాబు ఎక్స్ ప్రెస్ హరికి సద్దాం గురించి లేనిపోని మాటలు చెబుతూ తనని కొట్టేలా చేశారు.దీంతో ఎక్స్ ప్రెస్ హరి కర్ర తీసుకుని సద్దాంను కొట్టబోయాడు.అయితే ఆ సమయంలో సద్దాం శేఖర్ మాస్టర్ ని పట్టుకొని ఉండటం వల్ల సద్దాంకి తగలాల్సిన దెబ్బ శేఖర్ మాస్టర్ కి తగిలింది.ఇలా ఒక్కసారిగా ఎక్స్ ప్రెస్ హరి తనని కొట్టడంతో శేఖర్ మాస్టర్ గట్టిగా అరిచారు.

దీంతో ఒక్కసారిగా షోలో ఉన్న అందరూ షాక్ అయ్యారు.విషయం తెలుసుకున్న ఎక్స్ ప్రెస్ హరి శేఖర్ మాస్టర్ కు క్షమాపణలు చెప్పారు.

Comedian Express Hari Beat Shekhar Master Do You Know The Reason

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube