తన కలర్ ని చూసి ఏ అమ్మాయి తన పక్కన నిల్చోలేదని కానీ వర్ష అలా కాదంటూ ప్రపోజ్ చేసిన ఇమాన్యుయెల్.. దాంతో వర్ష...

తెలుగు బుల్లితెరపై ఈ మధ్యకాలంలో ప్రేమ జంటలు సందడి చేస్తుండడం మనం తరచూ చూస్తుంటాం…. అయితే గతంలో జబర్దస్త్ షోలో రష్మీ-సుధీర్ ల జంట బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Comedian Emmanuel Proposing To Varsha In Jabardasth Stage, Jabardasth Show News,-TeluguStop.com

 దీంతో ఇదే ఫార్ములాని చాలా మంది ఈవెంట్ దర్శక నిర్మాతలు అనుకరిస్తున్నారు.అయితే  ఈ మధ్య  జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేరినటువంటి ఇమ్మాన్యుయేల్ హైపర్ ఆది తరహాలో పంచులు పేలుస్తూ బాగానే పాపులర్ అవుతున్నాడు.

దీనికితోడు అప్పుడప్పుడు యంగ్ బ్యూటీ వర్ష తో లవ్ ట్రాక్ అంటూ బాగానే ఫేమ్ సంపాదించుకుంటున్నాడు.అయితే ఇటీవలే జబర్దస్త్ షో నిర్వాహకులు వచ్చేవారం ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేశారు.

దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో తెగ ట్రేండింగ్ అవుతోంది.

ఇందులో ప్రోమో చివర్లో ఇమ్మాన్యుయేల్ ఏకంగా మీరు అనుమతిస్తే వర్ష కి చిన్న సర్ప్రైజ్ ఇస్తానంటూ జడ్జెస్ అయిన రోజా మరియు సింగర్ మను లను అడుగుతాడు.

వారు ఓకే అనడంతో ఇమ్మాన్యుయేల్ వర్ష ని స్టేజ్ పైకి పిలిచి ఏకంగా లవ్ బెలూన్ ఇస్తూ ప్రపోజ్ చేస్తాడు. అంతేగాక చిన్నప్పటి నుంచి తన శరీరపు రంగును చూసి ఎవరూ తన పక్కన నిల్చునే వారు కాదని,  కానీ వర్ష మాత్రం అలా కాదని అంటూ పలు ఎమోషనల్ డైలాగ్ లు చెబుతాడు.

దీంతో రోజా కూడా వర్ష తన రంగుని చూసి కాకుండా మనసుని చూసిందంటూ చెబుతుంది.చివరికి కి ప్రపోజ్ చేసే సన్నివేశం మొత్తం ప్రోమోకి హైలెట్ అయ్యింది.

కానీ కానీ ఇమ్మాన్యుయేల్ ప్రేమని వర్ష అంగీకరించిందా….? లేదా.? అనే విషయం తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

అయితే గతంలో రష్మీ సుధీర్ లు తమ లవ్ ట్రాక్ విషయంపై స్పందిస్తూ కేవలం స్కిట్ లో భాగంగానే అలా నటిస్తామని తప్ప నిజంగా తమ మధ్య ఏమీ లేదంటూ స్పష్టం చేశారు.

 దీంతో నెటిజన్లు రష్మీ సుధీర్ ల మాదిరిగానే టిఆర్పీ ల కోసం ఇమ్మాన్యుయేల్ మరియు వర్ష లు నటిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజం తెలియాలంటే మరో వారం పాటు వేచి చూడాల్సిందే.

అయితే ఈ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేసిన ఒక్క రోజులోనే దాదాపుగా 10 లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube